Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లా రేణిగుంటలో వరద బీభత్సం... కూలుతున్న ఇళ్ళు

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (11:24 IST)
భారీ వ‌ర్షాలు చిత్తూరు జిల్లాను వ‌ణికిస్తున్నాయి. వ‌ర‌ద‌లు ముంచెత్తి ప‌ల్లెలు, పట్ట‌ణాలు కుదేల‌వుతున్నాయి. ఇళ్లు వ‌ర‌ద తాకిడికి కూలి పోతున్నాయి. జ‌నాలు హాహాకారాలు పెడుతున్నారు. భారీ వ‌ర‌ద‌తో కళ్యాణ్ డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. జల దిగ్బంధంలో రేణిగుంట మండలం జీవగ్రామ్, బాలాజీ నగర్ వాసులు అల్లాడుతున్నారు.  

 
స్థానిక బాలాజీ కాలనీ వాసులు వరద నీటిలో చిక్కుకున్నారు. సెయింట్ లూధరన్ చర్చ్   నీటమునిగింది.  వ‌ర‌ద విల‌య‌తాండ‌వంలో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. బోట్ సాయంతో స్థానికులను ఒడ్డుకు చేరుస్తున్నారు. జీవగ్రామ్ ప్రజలు 60 మందికి పైగా వరదల్లో చిక్కుకున్నారు. వారిని ర‌క్షించే ప్ర‌య‌త్నంలో ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాలున్నాయి.

 
గాజులమండ్యం వంతెన వ‌ర‌ద ప్ర‌మాదంలో చిక్కుకుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని ప్ర‌యాణికుల‌ను పోలీసులు దారి మళ్లించారు. ఇక తిరుపతి స‌మీపంలోని ముండ్లపూడి స్వర్ణముఖి నదిలో ఐదు మంది గల్లంతు అయ్యారు. వారి ఆచూకీ కోసం రంగంలోకి దిగిన ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. తిరుచానూరు వసుంధర నగర్లో స్వర్ణముఖి నది ఒడ్డున దాదాపు 10 ఇళ్లకు పైన ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. ఇళ్లలోనే కుటుంబాలను ఖాళీ చేయించి తిరుచానూర్ విఆర్వో ప్రసాద్ ప్రసాద్, రెవెన్యూ సిబ్బంది వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments