Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

ఠాగూర్
ఆదివారం, 29 జూన్ 2025 (19:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే 3 రోజులు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ రాజస్థాన్‌, ఉత్తర గుజరాత్‌ మీదుగా ఉపరితల ఆవర్తనం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు తూర్పు-పశ్చిమ ద్రోణి కొనసాగనుంది. 
 
మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్, ఉత్తర ఒడిశా మీదుగా అల్పపీడన ప్రాంతంతో సంబంధం ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ఈ ద్రోణి కొనసాగనుంది. సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఎత్తుకు వెళ్లేకొలది దక్షిణ దిశగా ద్రోణి వంగి ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
 
దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో పశ్చిమ గాలులు వీయనున్నాయి. ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు ఒకట్రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments