Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

ఠాగూర్
ఆదివారం, 29 జూన్ 2025 (18:36 IST)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటన సమయంలో అపశృతి చోటు చేసుకోగా, ఇందులో చీలి సింగయ్య అనే వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో అసలైనదేనని, అందులో ఎలాంటి మార్ఫింగ్ జరగలేదని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) తన నివేదికలో స్పష్టం చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ నివేదిక పోలీసులకు అందడంతో దర్యాప్తులో ఇది ఒక ముఖ్యమైన ఆధారంగా మారింది.
 
పర్యటన సందర్భంగా జగన్ ప్రయాణిస్తున్న కారు ముందు చక్రం కింద సింగయ్య నలిగిపోతున్న దృశ్యాలు ఒక సెల్ఫోన్‌ ఫోనులో రికార్డయ్యాయి. ఆ తర్వాత ఆ వీడియో వైరల్ అయింది. అయితే, ఈ వీడియో నకిలీదని, జగన్‌ను ఈ కేసులో ఇరికించేందుకు మార్ఫింగ్ చేశారని వైసీపీ నాయకులు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో, పోలీసులు ఆ వీడియో క్లిప్‌లను, ఘటనా స్థలంలో డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన ఫుటేజీని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. వీడియో రికార్డ్ చేసిన సెల్‌ఫోన్ ఐడీ, అది ఉన్న లొకేషన్ వంటి సాంకేతిక వివరాలను విశ్లేషించిన నిపుణులు, ఆ వీడియో ఒరిజినల్ అని, ఎడిటింగ్ జరగలేదని నిర్ధారించారు.
 
కాగా, ఈ కేసులో తన ప్రమేయం లేదని, తనపై నమోదు చేసిన ఎఫ్ఎస్ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై జులై 1వ తేదీన ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరుగనుంది. అదే రోజున పోలీసులు ఫోరెన్సిక్ నివేదికను కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక నివేదికను అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ మొన్న కోర్టుకు అందించారు. పూర్తి సాంకేతిక ఆధారాలు సమర్పించేందుకు గడువు కోరగా, కోర్టు అందుకు అంగీకరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: రామ్ చరణ్, కార్తీలతో సినిమాలు చేయనున్న సమంత

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments