Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సరస్వతి పవర్ భూములను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Video)

Advertiesment
pawan kalyan

ఠాగూర్

, మంగళవారం, 5 నవంబరు 2024 (16:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్ భూములను పరిశీలించారు. ప్రస్తుతం మాచవరం మండలంలోని వేమవరం, చెన్నాయపాలెంలో ఉన్న సరస్వతి పవర్ భూములను పరిశీలిస్తున్నారు. ఇక్కడ నిబంధనల ఉల్లంఘన జరిగిందా లేదా అనేది అధికారులతో కలిసి నిర్ధారించనున్నారు. 
 
పవన్ వెంట గుజరాల ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్, అటవీశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు ఉన్నారు. పవన్ తన పర్యటన సందర్భంగా భూములు ఇచ్చిన రైతులతో మాట్లాడుతున్నారు. పవన్ రాకతో సరస్వతి భూముల వద్ద కోలాహలం నెలకొంది. అలాగే, జనసేన పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో, వారిని పోలీసులు అదుపు చేశారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

5జీ టెక్నాలజీతో నోకియా ఎక్స్200 5G - ఫీచర్స్ ఇవే