Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండిపోతున్న ఉత్తర కోస్తా ... నేడు రేపూ ఇదే పరిస్థితి

Webdunia
ఆదివారం, 11 జూన్ 2023 (13:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర కోస్తా మండిపోతుంది. సూర్యతాపంతో ఆ ప్రాంత వాసులు బెంబేలెత్తిపోతున్నారు. శనివారం సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించారు. ఆది, సోమవారాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
ఆరేబియా సముద్రంలో ఉన్న అతితీవ్ర తుఫాన్, బంగాళాఖాతంలో గల తీవ్ర అల్పపీడనం దిశగా గాలులు వీయడంతో మొత్తం భూభాగం పొడిగా మారింది. ఇదేసమయంలో ఉత్తరకోస్తాపైకి వాయువ్య దిశ నుంచి పొడిగాలులు వీయడంతో ఉదయం నుంచే వేడి వాతావరణం కొనసాగింది. పది గంటల నుంచే వడగాడ్పులు వీచాయి. 
 
కోస్తాలోని మిగిలిన ప్రాంతాల్లో ఎండలు, గాడ్పులు వీచాయి. రాత్రి ఎనిమిది గంటలకు కూడా వాతావరణం వేడిగానే ఉంది. రుతుపవనాలు రాక ఆలస్యం కావడంతో ఎండలు కొనసాగడం సాధారణమే అయినా వారం నుంచి రోజురోజుకూ ఎండలు, వడగాడ్పులు పెరుగుతున్నాయి. 
 
రాష్ట్రంలో శనివారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఆరు నుంచి 11 డిగ్రీలు ఎక్కు వగా నమోదయ్యాయి. వాల్తేరులో సాధారణం కంటే 11 డిగ్రీలు ఎక్కువగా అంటే 43.4 డిగ్రీలు నమోదైంది. విశాఖ జిల్లా పద్మనాభం, విజయనగరం జిల్లా గుర్ల, ప్రకాశం జిల్లా మర్రిపాడులో 44.7 డిగ్రీలు, విజయనగరం జిల్లా అక్కివరంలో 44.8 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments