వాడు బతికేందుకు అర్హుడు కాదు.. ఉరికంటే పెద్ద శిక్షవుంటే..

Webdunia
ఆదివారం, 19 మే 2019 (09:03 IST)
సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని ఉరితీయాలని అతని తల్లిదండ్రులు, సోదరుడు డిమాండ్ చేస్తున్నారు. ఉరికంటే పెద్ద శిక్ష ఏదైనా ఉంటే ఆ శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ కుమారుడు అంత దుర్మార్గుడని తమకు తెలియదని, అతడికి ఎంతటి శిక్ష విధించినా తక్కువే అవుతుందన్నారు. అందువల్ల అతడ్ని చంపేయాలని చెప్పారు. 
 
అతడి వల్ల తాము తలెత్తుకోలేకపోతున్నామని, ఉన్న ఊరును వదిలి ప్రాణభయంతో ఎక్కడెక్కడో తిరుగుతున్నామన్నారు. తమ కుమారుడు చేసిన వరుస హత్యలపై తండ్రి బాల్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీనివాస్ రెడ్డి ఇన్ని దుర్మార్గాలకు పాల్పడతాడని తాము అనుకోలేదన్నారు. పైగా, అతడి ప్రవర్తనపై తమకు ఎప్పుడూ అనుమానం రాలేదన్నాడు. లిఫ్ట్ మెకానిక్‌గా పలు ప్రాంతాలు తిరిగేవాడని, గతేడాది గృహప్రవేశం సందర్భంగా ఇంటికి వచ్చాడని వివరించాడు.
 
కుమారుడి కారణంగా తమ బతుకులు ఆగమయ్యాయని అతడి తల్లి కన్నీరు పెట్టుకుంది. వాడిని చంపితేనే బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని, అమ్మాయిల ఆత్మకు శాంతి చేకూరుతుందని విజ్ఞప్తి చేసింది. వేములవాడకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని పలుమార్లు చెప్పాడని, ఆమెతో ఫోన్లో కూడా మాట్లాడించాడని వివరించింది. ఇన్ని ఘాతుకాలకు పాల్పడుతున్నా కుమారుడిపై తమకు ఎప్పుడూ అనుమానం రాలేదని చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments