పెద్దలు పెళ్లిక ఒప్పుకోలేదని తనువు చాలించిన ప్రేమజంట... ఎక్కడ?

ఠాగూర్
మంగళవారం, 30 సెప్టెంబరు 2025 (09:00 IST)
పెద్దలు తమ ప్రేమ పెళ్లికి అంగీకరించలేదన్న మనస్తాపంతో ఓ ప్రేమజంట అర్థాంతరంగా తనవు చాలించింది. ప్రేమికులిద్దరూ వేర్వేరుగా ప్రాణాలు తీసుకోవడం గమనార్హం. ఈ విషాదకర ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం, దమ్మాలపాడులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముప్పాళ్ల మండలం దమ్మాలపాడుకు చెందిన కోటె గోపీకృష్ణ (20), తెనాలి మండలం అత్తోటకు చెందిన బొల్లిముంత లక్ష్మీ ప్రియాంక (20) ఎన్ఆర్ఐటీ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నారు. పేరేచర్లలో వేర్వేరు వసతి గృహాల్లో ఉంటూ గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 5వ తేదీన గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌ను వారు ఆశ్రయించారు. కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నామని, పెళ్లి కూడా చేసుకున్నామని, తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 
 
దీంతో పోలీసులు ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. వారు ఈ పెళ్లికి అంగీకరించకపోవడంతో తమకు ఎవరి ప్రోత్సాహం అవసరం లేదని, సొంతంగా బతుకుతామని విద్యార్థులిద్దరూ వెళ్లిపోయారు. ఈలోగా ఏం జరిగిందో తెలియదు కానీ ఈ నెల 27న సాయంత్రం గుంటూరు నుంచి మార్కాపురం వైపు వెళ్లే ఓ రైలుకు గోపికృష్ణ ఎదురుగా వెళ్లాడు.. లోకో పైలట్ గమనించి హారన్ కొడుతున్నా పట్టించుకోలేదు. దీంతో రైలు ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందాడు. 
 
ఈ విషయం లక్ష్మీ ప్రియాంకకు తెలిసింది. మర్నాడు ఉదయం ఆమె కూడా అదే ప్రాంతంలో రైలు కిందపడి మృతి చెందింది. రైల్వే పోలీసులు మృతదేహాలను నరసరావుపేట ప్రాంతీయ ఆసుపత్రి తరలించారు. సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు. ప్రేమ విషయంలో మనస్తాపంతోనే ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడి ఉంటారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పైరసీ రాకెట్లపై సీపీ ఆనంద్‌తో సినీ ప్రముఖులు సమావేశం

Rashmika : హారర్‌ కామెడీ యూనివర్స్ చిత్రం థామా అలరిస్తుంది: రష్మిక మందన

Prabhas: ఫన్, ఫియర్, ఆల్ట్రా స్టైలిష్ గా ప్రభాస్ రాజా సాబ్ ట్రైలర్

Sudheer: ముగ్గురు నాయికలుతో సుడిగాలి సుధీర్ హీరోగా హైలెస్సో ప్రారంభం

OG Collections: ఓజీ నాలుగు రోజుల కలెక్లన్లు ప్రకటించిన డివివి ఎంటర్ టైన్ మెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments