Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్‌లో అంపూర్తిగా ఎంట్రీ ... ఆఫ్‌లో లైన్‌లో చేతివాటం

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (20:30 IST)
అవినీతి రహిత పరిపాలన అందించాలన్న ముఖ్యమంత్రి ఆశయాలను క్రింది స్థాయి సిబ్బంది నీరు గార్చుతున్నారు... అంతా ఆన్‌లైన్ లావాదేవీలే అయినా అవినీతి మాత్రం అంతం కావడంలేదు. శవాలు మీద డబ్బులు ఏరుకునే వారు కొందరైతే... కాళ్లు చేతులులేకుండా మంచంలో పడ్డ వికలాంగుల ను సైతం వదలకుండా పీడించుకుతింటున్న వైనం వైద్య ఆరోగ్య శాఖలో వెలుగు చూస్తోంది. కొందరు చేస్తున్న ఈ అవినీతి కంపు వలన వ్యవస్థకు ప్రభుత్వాలకు చెడ్డ పేరు తప్పడంలేదు.
 
శరీరంలోని అవయవాలు సక్రమంగా లేని అంగవైకల్యం చెందిన వారికి గతంలో జిల్లా ఆసుపత్రిలో వైద్యులు పరిశీలించి వికలాంగ సర్టిపికెట్లు ఇచ్చేవారు. అయితే గత కొంత కాలం నుండి వైద్య ఆరోగ్య, కుటంబ సంక్షేమం శాఖ ఆద్వర్యలో ఏర్పాటు చేసిన సదరం క్యాంపుల ద్వారా జారీ చేస్తున్నారు. 
 
ఈ సదరం క్యాంపులో పేరు నమోదు చేసుకోవాలంటే నానా అవస్తలు పడాలి. మీ సేవా చుట్టు తిరిగి పేరు నమోదు చేసుకుని స్లాట్ దొరకాలంటేనే నెలలు సంవత్సరాలు పడుతోంది. తీరా ఏదొక ఊరులో జరిగే క్యాంపులో స్లాట్ దొరికినా అక్కడ వైద్యులు పరీక్షించి వైక్యల్యాన్ని నిర్ధారించి శాతాన్ని నమోదు చేస్తున్నారు. 
 
ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడ మొదలవుతుంది డేటా ఎంట్రీ చేసే బాధ్యుల బాగోతం. అన్ని సక్రమంగా అప్‌లోడ్ చేయకుండా అసంపూర్తిగా చేస్తున్నారు. తీరా దరఖాస్తుదారు తిరిగి సర్టిపికెట్ కోసం మీసేవలకు వెళితే ఐడి కార్డు అప్‌లోడ్ అవలేదని ఎక్కడైతే క్యాంపు జరిగిందో అక్కడకు వెళ్లి కనుక్కోవాలని సూచిస్తున్నారు. 
 
తీరా అక్కడికి వెళితే ఆపరేటర్లు సింపుల్‌గా చెప్పేస్తారు... ఒక వారం ఆగి చెక్ చేసుకోండి. అప్పటికీ అప్‌లోడ్ అవకుంటే రండి అని చెప్తారు. ఎన్ని నెలలు గడిచినా కరక్షన్, అప్‌లోడులు అవవు. ఎంతో బాధతో భారంతో తిరిగి సదరు క్యాంపు జరిగిన ఆసుపత్రుల్లోని డేటా ఎంట్రీ ఆపరేటర్ల వద్దకు వెళితే అప్పడు చెప్తారు. ఇది హెడ్ ఆఫీసులో చేయించాలి. గుంటూరు, విజయవాడలో అంటారు. ఎప్పుడు అవుద్దంటే టైమ్ పడుతుందంటారు. 
 
మనసులో మాట చెప్పేస్తారు. ఫార్మాలిటీ కోసమే ఆగిందనే హింట్ ఇచ్చేస్తారు.  ఎంతంటే రెండు మూడు వేలు అవుద్దని సున్నితంగా సూచిస్తారు. ఇక అంతే అప్పటికే విసిగి వేసారిన వారు కోపం, ఆగ్రహంతో ఏమి చేయలేక తిట్టుకుంటూ బేరమాడి ముడుపులు ముట్టచెప్పక తప్పడంలేదు. 
 
ముడుపులు ఇచ్చారో మూడు నిమిషాల్లోనే ఆన్‌లైన్ సరిచేస్తున్నారు. ఇవ్వలేదో అక్కడ.. ఇక్కడ.. అప్పుడు రండి.. ఇప్పుడు రండంటూ ఈసడింపు సమాధానాలు చెప్పిపంపుతున్నారు. చేసేది ఏమిలేక లంచం ఇవ్వడం ఇష్టంలేకున్నా ఇవ్వక తప్పని పరిస్థితి. ఇంత తంతు జరుగుతున్నా పరీక్షించి డిజిటల్ సంతకం చేసే వైద్యులకు తెలియడంలేదు. ఇలా రాష్ట్రంలో ఎంతో మందిని వేదించుకుతింటున్నారు క్రింది స్థాయి సిబ్బంది. 
 
కాళ్లుచేతులు లేని కుంటోళ్లు, గుడ్డోళ్లు, చెవిటి, మూగ వారి వద్ద కూడా పీక్కుతునే పాపిస్టి అవినీతి జలగల వలన అటు ప్రభుత్వంకు మాయని మచ్చలుగా నిలుస్తున్నాయి. సంబంధిత అధికారులు ఈ సదరం క్యాంపులలో పెండింగులో ఉన్న సర్టిపికెట్లు, ఆన్‌లైన్‌లో జరుగుతున్న మోసాలు అవినీతి బాగోతాలపై విచారించి అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments