షాపులో పనిచేస్తున్న యువతికి కూల్ డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి..

Webdunia
బుధవారం, 19 మే 2021 (18:54 IST)
ఏపీలోని గుంటూరు జిల్లా పొన్నూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ దుకాణం యజమాని లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన షాపులో పనిచేస్తున్న యువతికి కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి, లైంగికదాడి చేసిన యజమానిపై బాధితురాలి తల్లిదండ్రులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన యువతి ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. కరోనా కారణంగా కళాశాల మూతపడడంతో ఏదైనా పనిచేసి కుటుంబానికి ఆసరాగా నిలవాలని పట్టణంలోని స్వీట్స్ షాపులో నెలకు రూ.5 వేల జీతంపై పనిలో చేరింది. 
 
దుకాణ యజమాని సోమవారం ఎవరూ లేని సమయంలో ఆమెకు శీతల పానీయంలో మత్తు మందు కలిపి ఇచ్చాడు. తాగిన కొద్దిసేపటికే ఆమె మత్తులోకి జారుకుంది. లైంగిక దాడి కి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులకు చెప్పింది. పొన్నూరు అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అప్పట్లో ఎకరం 9 లక్షలకు అమ్మా, ఇప్పుడక్కడ ఎకరం 100 కోట్లు, ఏం చేస్తాం?: నటుడు శివాజీ

Chiranjeevi: పెద్ది చిత్రం రైరై రారా పాట లో చరణ్ కష్టానికి ఫలితం దక్కింది : మెగాస్టార్ చిరంజీవి

Laya: మా అమ్మాయి ఓటీటీలో సినిమా అనగానే ఎంతో బాధపడింది : లయ

Pooja : దోశ డైరీస్ పై మంచి కథలన్నీ నిర్మించాలని ఉంది.: పూజా శరత్ కుమార్

Manoj: డేవిడ్ రెడ్డి షూటింగ్‌తో మనోజ్ బిజీ - సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్న మౌనిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం