Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప‌వ‌న్ మూడ్ ఎలా వుంటందో చెప్ప‌లేంః థ‌మ‌న్

ప‌వ‌న్ మూడ్ ఎలా వుంటందో చెప్ప‌లేంః థ‌మ‌న్
, బుధవారం, 19 మే 2021 (18:20 IST)
Pavan(tw)
`నాకు కొద్దిగా తిక్కుంది. దానికి ఓ లెక్కుంది` అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌పై త‌నే సెటైర్ వేసుకునేవాడు. అది తెలిసిందే. అందుకే ఆయ‌న్ను క‌ల‌వాలంటే ఎవ‌రికైనా భ‌య‌మేస్తుంది. ఆయ‌న ఏ మూడ్‌లో వుంటారో అని ద‌డిసేవారు. స‌రిగ్గా సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ కూడా అదే భావించాడు. ప‌వ‌న్ న‌టించిన `వ‌కీల్ సాబ్‌` సినిమాకు థ‌మ‌న్ సంగీతం స‌మ‌కూర్చారు. ద‌ర్శ‌కుడు సంద‌ర్భం చెప్పాక పాట‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి వంటివారు రాశారు. బాణీలు ఎలా వుండాల‌నే విష‌యంలో ప‌వ‌న్ జోక్యం చేసుకోలేదు. నేను క‌ల‌వానుకున్నా ఆయ‌న మూడ్ ఎలా వుంటుందోన‌ని భ‌య‌ప‌డ్డాను. ఈ విష‌యాన్ని ఇటీవ‌లే ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.
 
ఎందుకంటే ఆయ‌న ముందు పెద్ద బాధ్య‌త వుంది. పొలిటిక‌ల్ విష‌యాల‌లో బిజీ. ఆయ‌న ఏదో చేయాల‌ని  ఏదో ఆలోచ‌న‌లో వుంటారు. అలాంటి టైంలో నేను వెళ్ళి ఆయ‌న మూడ్‌ను డిస్ట‌బ్ చేయ‌ద‌ల‌చుకోలేదు. నా వ‌ల్ల ఆయ‌న ఆలోచ‌న‌ల‌కు ఏదో చేయాల‌నే సేవ కూడా ఆగిపోతుందని భ‌యప‌డేవాడిని. అందుకే ఆయ‌న్ను క‌ల‌వ‌లేదు. కానీ వ‌కీల్ సాబ్ సినిమా షూటింగ్‌లో వుండ‌గా రెండు సార్లు ర‌మ్మ‌న్నారు. అలా రెండు సార్లు వెళ్ళాను. అన్న‌పూర్ణ స్టూడియోలో కోర్టు సీన్ చేస్తుండ‌గా వెళ్ళాను. స‌త్య‌మేవ జ‌య‌తే, కంటిపాప‌, మ‌గువా మ‌గువా.. పాట ట్యూన్‌ను వినిపించాను. ఆయ‌న‌కు బాగా న‌చ్చాయి.

మ‌గువా మ‌గువా.. సాంగ్‌ను ఆయ‌న డ‌బ్బింగ్‌కు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా రెండు, మూడు సార్లు చూసేవారు. చూసి న‌ప్పుడ‌ల్లా `వాట్ ఎ ల‌వ్లీ సాంగ్‌` అనేవారు. ద‌ర్శ‌కుడు వేణు శ్రీ‌రామ్‌, నిర్మాత దిల్‌రాజుకు కూడా బాగా న‌చ్చాయి. నాకు ప‌వ‌న్‌తో వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకున్నానని తెలిపారు. అయితే కోవిడ్ వ‌చ్చాక ఆ సాంగ్ స‌క్సెస్‌ను ఎంజాయ్ చేయ‌లేక‌పోయాను. థియేట‌ర్ల‌కు వెళ్ళి క‌ల‌వ‌లేక‌పోయానే బాధ‌ను వ్య‌క్తం చేశాడు. ఏదైనా ముందు ఆరోగ్యం చూసుకోవాలి. ఎదుటి ఆరోగ్యం కూడా కాపాడాలి అని సెల‌విచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాఘ‌వేంద్ర‌రావు పుట్టిన‌రోజున‌`పెళ్లి సంద‌D` రెండ‌వ‌పాట‌