Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాక్సిన్ వేయించుకోని ఉద్యోగుల జాబితా సిద్ధం చేయండి...

Webdunia
ఆదివారం, 23 మే 2021 (15:31 IST)
గుంటూరు జిల్లాలో శాఖల వారీ వివిధ హోదాల్లో పనిచేస్తూ ఇప్పటివరకు కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోని ఉద్యోగుల జాబితాలను సిద్ధంచేసి నివేదికను పంపిచాలని జిల్లా, డివిజన్, మున్సిపల్, మండల స్థాయి అధికారులను కలెక్టరు ఏఎండి ఇంతియాజ్ ఒక ప్రకటనలో ఆదివారం తెలియజేశారు. 
 
జిల్లాలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు జిల్లా యంత్రాంగం కోవిడ్ నియంత్రణపై 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ అందించేందుకు పెద్దఎత్తున టీకా డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడం వలన ఒకరి నుంచి మరోకరికి కోవిడ్ వ్యాప్తి చెందకుండా విచ్ఛిన్నం చేసేందుకు కీలకమవుతుందని కలెక్టరు అన్నారు. 
 
కావున జిల్లా అధికారులు, డివిజన్ స్థాయి అధికారులు సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, మున్సిపల్ కమీషనర్లు, మండల స్థాయిలో తాహశీల్థార్లు, యంపీడీవోలు కార్యాలయాల్లో పనిచేస్తూ ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోని వారి జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. 
 
పేరు, హోదా, ప్రస్తుతం పనిచేస్తున్న ప్రదేశం, వయస్సు, ఆధార్ నెంబరు, సెల్ నెంబరుతో సహా నిర్ణీత ఫ్రోఫార్మాలో రూపొందించిన జాబితాలను తదుపరి చర్య నిమిత్తం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి పంపించాలని కలెక్టరు ఆ ప్రకటనలో తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments