కరోనా కారణంగా తల్లిదండ్రులు పోగొట్టుకున్న పిల్లల పునరావాసం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్ చెప్పారు.
నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం మాట్లాడుతూ, కోవిడ్‌తో తల్లిదండ్రులు ఇద్దరు హాస్పిటల్‌లో చేరితే పిల్లలకు తాత్కాలిక సంరక్షణ కల్పిస్తామన్నారు. ఇందుకు సంబంధించి 181,1098 టోల్ ఫ్రీ నంబర్లుతో హెల్ప్ డెస్క్ ఏర్పాటు అయిందన్నారు.
కరోనా బారినపడి వైద్య చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన, కోవిడ్ కేర్ సెంటర్‌లో ఉన్న, హోమ్ ఐసోలేషన్‌లో ఉండి తగిన వసతి లేకపోయిన అటువంటి పిల్లలకు చైల్డ్ లైన్ ద్వారా తాత్కాలిక సంరక్షణ అందిస్తున్నమన్నరు.
తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన పిల్లలను చేరదీసి బాలల సంరక్షణ కేంద్రాల్లో రక్షణ కల్పించి పునరావాసం చర్యలు తీసుకుంటామన్నారు. అటువంటి పిల్లల సమాచారాన్ని వారి బంధువులుగాని, చుట్టుపక్కల వారుగాని 108, 1098 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చునన్నారు.