Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'రైట్ టు లైఫ్' ఆపడానికి మీకు ఏ అధికారం వుంది : తెలంగాణాను నిలదీసిన హైకోర్టు

'రైట్ టు లైఫ్' ఆపడానికి మీకు ఏ అధికారం వుంది : తెలంగాణాను నిలదీసిన హైకోర్టు
, శుక్రవారం, 14 మే 2021 (16:12 IST)
ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కరోనా రోగుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను రిలీజ్ చేశారు. వీటిపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా మండిపడింది. 'పేషంట్లను తీసుకొస్తున్న అంబులెన్స్‌లు ఆపడం ఎక్కడైనా చూశామా? "రైట్ టు లైఫ్‌"ను ఆపడానికి మీకు ఏం అధికారం ఉంది? ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి నిబంధన మేం చూడలేదు. రోగులు సరిహద్దుల్లోనే చనిపోతున్నారు. పేషెంట్లు చనిపోతుంటే మీరు సర్క్యులర్లు జారీ చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
కరోనా రోగులతో తెలంగాణా రాష్ట్రంలోని ఆస్పత్రులకు వస్తున్న పొరుగు రాష్ట్రాలకు చెందిన అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ అంశంపై హైకోర్టులో ఓ ప్రజాహిత వ్యాజ్యం దాఖలుకాగా, ఈ వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమాకోహ్లీ నేతృత్వంలో విచారణ జరిగింది. 
 
ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి కరోనా పేషెంట్లు ఎక్కువగా వస్తున్నారని, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ నుంచి కరోనా బాధితులు వస్తున్నారని కోర్టుకు ఏజీ విన్నవించారు. ప్రతి పేషేంట్‌కు ఆస్పత్రి అడ్మిషన్‌ ఉండాలని ఏజీ అన్నారు. తాము ఆదేశాలు ఇచ్చినా... సర్క్యులర్ ఎలా జారీ చేస్తారంటూ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 
 
ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికి ప్రాణాలు కాపాడుకునే హక్కు ఉందని, విజయవాడ, హైదరాబాద్ మార్గం నేషనల్‌ హైవే.. దానికి కేంద్ర ప్రభుత్వంపై అధికారం ఉంటుందని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదని పేర్కొంది. అంబులెన్స్‌లను ఆపడానికి తెలంగాణ సర్కార్‌కు హక్కు లేదని, ఇప్పటివరకు దేశంలో ఎక్కడ కూడా.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ లాంటిది ఇవ్వలేదని తెలిపింది. కోర్ట్ చెప్పినా కూడా ఆదేశాలు పాటించలేదని హైకోర్టు మండిపడింది. 
 
'పేషంట్లను తీసుకొస్తున్న అంబులెన్స్‌లు ఆపడం ఎక్కడైనా చూశామా? "రైట్ టు లైఫ్‌"ను ఆపడానికి మీకు ఏం అధికారం ఉంది? ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి నిబంధన మేం చూడలేదు. రోగులు సరిహద్దుల్లోనే చనిపోతున్నారు. పేషెంట్లు చనిపోతుంటే మీరు సర్క్యులర్లు జారీ చేస్తారా? సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లోనూ జనరల్‌ బెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. 
 
ఇతర రాష్ట్రాల ప్రజలకే కాదు.. హైదరాబాద్‌లో ప్రజలకు సైతం అడ్మిషన్ ఉండట్లేదు. హైదరాబాద్‌లో పేషెంట్లకు ఆక్సిజన్ అవసరమైతే.. చిన్న ఆస్పత్రుల నుంచి పెద్ద ఆస్పత్రులకు వెళ్లడం లేదా? గద్వాల్, ఖమ్మం, నిజామాబాద్ నుండి కూడా.. 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి పేషంట్లు వస్తున్నారు, వారిని ఆపుతున్నారా? రాజ్యాంగాన్ని మీరు మార్చలేరు' అంటూ హైకోర్టు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉద్యోగులకు బజాజ్ వరాలు: ఉద్యోగి మరణిస్తే రెండేళ్లు జీతం, కుటుంబ సభ్యులకు ఐదేళ్లు హాస్పిటలైజేషన్‌ బీమా ఖర్చు