అప్పు తిరిగి చెల్లించలేదని.. మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశాడు..

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (22:24 IST)
గుంటూరు జిల్లాలో ఈ మధ్య నేరాల సంఖ్య అమాంతం పెరిగిపోతున్నాయి. ఒకవైపు మహిళలపై అకృత్యాలు జరుగుతూనే వున్నాయి. మరోవైపు హత్యలు కూడా కొనసాగుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. అప్పు చెల్లించలేదన్న కోపంతో.. ఓ మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశాడు ఓ దుర్మార్గుడు. 
 
వివరాల్లోకి వెళితే.. గుంటూరు, నకరికల్లు మండలం శివాపురానికి చెందిన రమావంత్ మంత్రూభాయి (55) అనే మహిళ... శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తి దగ్గర తన అవసరం నిమిత్తం రూ.3.80 లక్షలు అప్పుగా తీసుకుంది. ఆ అప్పుకు తన పొలాన్ని తాకట్టుగా పెట్టింది. కానీ అప్పు తీర్చాలంటూ శ్రీనివాస్ రెడ్డి ఆమెను వేధించడం మొదలెట్టాడు.
 
ఎక్కడ కనబడితే అక్కడ డబ్బులడిగే శ్రీనివాస్ సోమవారం పొలం వద్దకే వెళ్లాడు. అంతటితో ఆగకుండా అప్పు తీర్చనందుకు సదరు మహిళను ట్రాక్టర్‌తో తొక్కించాడు శ్రీనివాసరెడ్డి.. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments