Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌదీలో సంసారం, మోజు తీర్చుకుని ఇండియాకి రాగానే ఆమె ఎవరో తెలియదంటున్నాడు?

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (22:22 IST)
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అల్లీనగరం గ్రామానికి చెందిన ఆవులమంద శేఖర్ సౌదీలో ఉండేవాడు. అదే ప్రాంతం సమీపంలోని చెన్నూరుకు చెందిన నాగమణి కూడా సౌదీలో పనిచేస్తూ ఉండేది. ఒక ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఎలాగూ పెళ్లి చేసుకుంటాం కదా అని పెళ్ళికి ముందే ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. 
 
ఆ తర్వాత కొద్దిరోజుల్లో నాగమణి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఏదో తూతూమంత్రంగా పెళ్ళి చేసుకున్నాడు శేఖర్. ఇద్దరూ కలిసి కాపురం పెట్టారు. వారికి ఐదేళ్ళ కుమార్తె కూడా ఉంది. అయితే లాక్‌డౌన్ కావడంతో స్వస్థలాలకు చేరుకునే క్రమంలో ఇద్దరూ ఇండియాకు వచ్చేశారు.
 
ఇక్కడకు వచ్చిన వెంటనే ప్లేటు ఫిరాయించాడు శేఖర్. నాగమణి ఎవరో తనకు తెలియదంటూ బుకాయించాడు. పెళ్ళి చేసుకుని ఇప్పుడు తానెవరో తెలియదని చెప్పడంతో నాగమణి కుంగిపోయింది. పెద్దలతో పంచాయతీ పెట్టించింది. అసలు ఐదేళ్ళ కుమార్తె తన బిడ్డే కాదంటున్నాడు శేఖర్.
 
దీంతో పంచాయతీ పెద్దలు ఎలాగోలా సర్దిచెప్పారు. కానీ తనకు 5 లక్షల కట్నం కావాలంటూ ఇప్పుడు రివర్స్ అయ్యాడు శేఖర్. తన దగ్గర అంత డబ్బు లేదని పంచాయతీ పెద్దల ముందే నాగమణి చెప్పడంతో శేఖర్ పంచాయతీ ముగియక ముందే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తన బిడ్డతో పాటు భర్త ఇంటి దగ్గరకు వెళితే తాళాలు వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు. దీంతో న్యాయం కావాలంటూ బాధితురాలు భర్త ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments