కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తోంది. తాజాగా సౌదీ అరేబియాలో కోవిడ్ కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. రెండు లక్షల దిశగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ మేరకు గురువారం ఒక్క రోజే నమోదైన 3,402 కొత్త కేసులతో కలిపి ఇప్పటి వరకు సౌదీ వ్యాప్తంగా ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 1,97,608కు చేరిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇక గురువారం 49 మంది కరోనాతో చనిపోవడంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారికి బలైన వారు 1,752 మంది అయ్యారని ఆరోగ్యశాఖ అధికారులు తెలియజేశారు.
అయితే, గత రెండు మూడు రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలు పెరుగుతుండటం కాస్తా ఊరటనిచ్చే విషయమని ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం 4,909 మంది కోవిడ్ పేషెంట్స్ కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం రికవరీలు 1,37,669కు చేరాయి.