Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప జిల్లాలో కాల్పుల కలకలం.. భగ్గుమన్న ఫ్యాక్షన్ కక్షలు - ఇద్దరు మృతి

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (09:40 IST)
రాయలసీమ ప్రాంతమైన కడప జిల్లాలో ఫ్యాక్షన్ కక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ  కక్షల కారణంగా తుపాకీ కాల్పుల మోతమోగింది. ఈ జిల్లాకే చెందిన ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రాతినిథ్యం వహించే పులివెందుల మండలం మండ‌లం న‌ల్ల‌పురెడ్డిప‌ల్లెలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. 
 
ప్రసాద్ రెడ్డి తన లైసెన్స్ తుపాకితో పార్థసారథి రెడ్డి అనే వ్యక్తిపై కాల్పలు జరిపాడు. దీంతో ఘటనా స్థలంలోనే పార్థసారథి రెడ్డి మృతి చెందాడు. అనంత‌రం ప్రసాద్‌రెడ్డి అదే తుపాకీతో కాల్చుకొని ఆత్మహ‌త్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ఇరువురూ మృతి చెందారు. 
 
వ్యక్తిగత గొడవలే ఘటనకు కారణమని స్థానికులు అనుకుంటున్నారు. గత కొంత కాలం ఈ రెండు కుటుంబాల మధ్య ఆస్తి తగదాలు నెలకొన్నాయి. ఇదే అంశంపై చాలా సార్లు గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. ఆస్తి విష‌యంలో వివాదాలే కాల్పుల‌కు కార‌ణమ‌ని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments