Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడివాడ క్యాసినో అంశంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (17:14 IST)
సంక్రాంతి సంబరాల్లో భాగంగా రాష్ట్ర మంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గమైన గుడివాడలో  నిర్వహించిన గోవా క్యాసినో వ్యవహారాన్ని రాష్ట్ర గవర్నర్ హరిచందన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ గురువారం గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది.
 
ఇదే అంశంపై ఆ పార్టీ  సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ, క్యాసినో నిర్వహణ అంశంపై డీజీపీ, జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వానికే కాదు ప్రభుత్వ అధికారులకు కూడా చెవులు, కళ్లు పని చేయడం లేదన్నారు. 
 
మంత్రి కొడాలి నానిని రక్షించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా అధికార యంత్రాంగం మొత్తం తపనపడుతున్నారని, ఇక చేసేది లేక తాము గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. అయితే, గవర్నర్ అనారోగ్యంగా ఉండటంతో ఆయన కార్యదర్శి సిసోడియాకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. 
 
సంక్రాంతి తర్వాత కొడాలి నాని కాస్త క్యాసినో నానిగా మారారన్నారు. రూ.10 వేలు ఫీజుతో క్యాసినో ఏర్పాటు చేశారని చెప్పారు. తద్వారా రాష్ట్రంలో విష సంస్కృతికి తెరలేపారని చెప్పారు. గుడివాడలో జరిగిన గోవా క్యాసినో ప్రపంచం మొత్తం చూసినా సీఎ జగన్‌తో పాటు.. వైకాపా నేతలు చూడలేక పోవడంతో విచిత్రంగా ఉందని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments