Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 10 April 2025
webdunia

అల్జీమర్స్‌తో బాధపడే వ్యక్తి విపక్షనేత.. అంతా దురదృష్టం.. కొడాలి నాని

Advertiesment
Minister
, సోమవారం, 24 జనవరి 2022 (22:48 IST)
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రెస్‌మీట్ ద్వారా టీడీపీని ఏకిపారేశారు. గుడివాడలో కేసినో ఏర్పాటు చేశారంటూ తనపై టీడీపీ చేస్తున్న పోరాటంపై స్పందించారు. 
 
అల్జీమర్స్ జబ్బుతో బాధపడుతున్న చంద్రబాబు వంటి వ్యక్తి విపక్షనేతగా ఉండడం ఈ రాష్ట్రం చేసుకున్న దురదృష్టం అని వ్యాఖ్యానించారు. తనను మంత్రి పదవి నుంచి తప్పించాలన్నదే చంద్రబాబు ప్రయత్నమని అన్నారు. గుడివాడలోని తన 'కే కన్వెన్షన్'లో కేసినో జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 
 
అది నిజమని నిరూపిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని సవాల్ విసిరితే, కన్వెన్షన్ సమీపంలో జరిగిందంటూ టీడీపీ 420 గాళ్లు మాటమార్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కే కన్వెన్షన్ సెంటర్ సమీపంలోని అని కాకుండా, గుడివాడలో జరిగిందంటున్నారని విమర్శించారు. 
 
తాను ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో ఉంటే తనపై ఇష్టంవచ్చిన రీతిలో రాద్ధాంతం చేశారని ఆరోపించారు. కరోనా వచ్చి చికిత్స పొందుతున్న తనను టార్గెట్ చేశారని వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సైబర్ మోసం ద్వారా బ్యాంకుకే కన్నం వేసిన కేటుగాళ్లు: రూ. 12 కోట్లు హాంఫట్