ప్రాంక్ వీడియోకు ఎన్ని లైక్‌లు వస్తాయో చూద్దామనీ... తరగతి గదిలో పెళ్లి : ప్రిన్సిపాల్

Webdunia
గురువారం, 3 డిశెంబరు 2020 (16:13 IST)
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మైనర్లు అయిన విద్యార్థినీ విద్యార్థి పెళ్లి చేసుకున్నారు. బాలిక మెడలో తాళికట్టిన బాలుడు.. ఆపై నుదుట పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి లీక్ అయింది. దీంతో కలకలం రేగింది. ఆ వెంటనే స్పందించిన కాలేజీ ప్రిన్సిపాల్ మేరీ సుజాత సంబంధిత విద్యార్థులపై చర్య తీసుకున్నారు. 
 
ఇదే అంశంపై ప్రిన్స్‌పాల్ మాట్లాడుతూ, వీడియోలో ఉన్న అమ్మాయి కాలేజీ టాపర్ అని, కేవలం సరదాగా ప్రాంక్ వీడియో చేయడం కోసమే ప్రేమ వివాహం చేసుకున్నట్లు విచారణలో వెల్లడించారని తెలిపారు. అయినా ఇలాంటి పనులు కాలేజీలో చేయడం తప్పని భావించి ఇద్దరు విద్యార్థులకు గట్టి వార్నింగ్‎ ఇచ్చి, వారికి సహాయం చేసిన మరో విద్యార్థికి కూడా టీసీ ఇచ్చి కాలేజీ నుంచి ముగ్గురిని పంపిచామని తెలిపారు. 
 
నవంబరు 27న విద్యార్థుల తల్లిదండ్రులు పెళ్లి వీడియో తమ దృష్టికి తెచ్చారని ప్రిన్సిపాల్ మేరీ సుజాత చెప్పారు. దీనిపై తాము విచారణ జరిపినప్పుడు నవంబర్ 17వ తేదీ ఉదయం 8-30 గంటలకు ముగ్గురు విద్యార్థులు కాలేజీకి వచ్చి ఈ విధంగా చేస్తే లైక్‌లు ఎన్ని వస్తాయో చూద్దామని సరదాగా ప్రాంక్ వీడియో తీసుకున్నామని, తర్వాత భయం వేసి వెంటనే వీడియోను తొలగించామని విద్యార్థులు రాతపూర్వకంగా ఇచ్చారని ప్రిన్సిపాల్ తెలిపారు. 
 
ఈ విషయం తమ తల్లిదండ్రులకు చెప్పినా వినడంలేదని, తాము సరదాగా తీసుకున్నదే తప్ప.. ఎలాంటి చెడు ఆలోచన లేదని విద్యార్థులు చెప్పారని ఆమె అన్నారు. కాలేజీ ఉదయం 9-30 తెరుస్తామని, అయినా వారు 8-30 గంటలకే కాలేజీకి వచ్చి ప్రాంక్ వీడియో తీయడం తప్పని భావిస్తూ.. వారికి టీసీ ఇచ్చి పంపిచామని ప్రిన్సిపాల్ మేరీ సుజాత తెలిపారు. మొత్తంమీద ఈ వ్యవహారం జిల్లాలో సంచలనంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments