మేజర్ల సహజీవన స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు : అలహాబాద్ హైకోర్టు

Webdunia
గురువారం, 3 డిశెంబరు 2020 (16:02 IST)
ఇటీవలి కాలంలో సహజీవనం చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో ఇపుడు సహజీవనంపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఒక మేజర్ అయిన అబ్బాయి, అమ్మాయి కలిసి జీవించవచ్చని, అది వారి స్వేచ్ఛ అని, దాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదని పేర్కొంది. 
 
ఫరూఖాబాద్‌కు చెందిన కామినీ దేవి, అజయ్ కుమార్ అనే జంట సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరికీ వారివారి కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు తలెత్తడంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ జంట వేసిన రిట్ పిటిషన్‌ను ధర్మాసనం సోమవారం విచారించింది. 
 
తాము ఇద్దరం మేజర్లమని, ప్రేమించుకుంటున్నామని కలిసి జీవిస్తున్నామని పిటిషన్‌లో కామిని పేర్కొంది. అయితే తమను తన తల్లిదండ్రులు వేధింపులకు గురిచేస్తున్నారని, వేరే అబ్బాయితో పెళ్లికి బలవంతం చేస్తున్నారంటూ కామినీ దేవి తన పిటిషన్‌లో తెలిపింది. 
 
ఈ వాదనలు ఆలకించిన ఉన్నత న్యాయస్థానం రాజ్యాంగం ప్రసాధించిన జీవించే హక్కును కాలరాసే హక్కు ఎవరికీ లేదని పేర్కొంది. మేజర్ అయిన ఒక అమ్మాయి, అబ్బాయి కలిసి జీవించడమనేది వారి హక్కని పేర్కొంది. 
 
వారి స్వేచ్ఛను హరించడానికి వారి తల్లిదండ్రులతో సహా ఎవరికీ హక్కు లేదని పేర్కొంది. వారికి రక్షణ కల్పించాల్సిందిగా ఫరూఖాబాద్ ఎస్ఎస్పీని జస్టిస్ అంజనీ కుమార్ మిశ్రా, జస్టిస్ ప్రకాశ్ పడియా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments