Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్ యాక్టివ్ జీ మెయిల్ అకౌంట్‌లపై గూగుల్ కీలక నిర్ణయం.. ఏంటది?

ఠాగూర్
శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (09:37 IST)
ప్రముఖ టెక్ సెర్జింజన్ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. నెలల తరబడి ఇన్‌యాక్టివ్‌గా ఉన్న ఖాతాలను తొలగించాలని నిర్ణయించింది. ఇలాంటి ఇన్‌యాక్విట్ మెయిల్స్ ద్వారా సర్వర్‌కు భారం అవుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇన్‌యాక్టివేట్ మెయిల్స్‌ను యాక్టివేట్ చేసుకునేందుకు శుక్రవారం వరకు గడువు ఇచ్చింది. ఈ లోగా అవసరం ఉన్న మెయిల్ ఐడీలను యూజర్లు యాక్టివ్ చేసుకోవాలని లేకపోతే డిలీట్ చేయనున్నట్లు వెల్లడించింది.
 
యూజర్లు తమ జీ మెయిల్ అకౌంట్లు యాక్టివ్‌గా ఉండాలంటే సెప్టెంబరు 20 (నేడు) లోగా మెయిల్ లాగిన్ చేసి వచ్చిన మెయిల్స్‌ను చదవడం.. ఎవరికో ఒకరికి మెయిల్ చేసినా ఆ జీ మెయిల్ అకౌంట్ యాక్టివ్ అవుతుంది. లేకపోతే ఆటోమేటిక్‌గా జీ మెయిల్ డిలీట్ అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 1.5 బిలియన్ల మంది జీ మెయిల్స్‌ను వినియోగిస్తున్నారు. పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ల వినియోగం నేపథ్యంలో జీ మెయిల్ అకౌంట్ కూడా తప్పనిసరిగా మారింది. విద్యార్థులు మొదలుకొని సంస్థలు, వ్యాపారవేత్తలు తప్పనిసరిగా జీ మెయిల్ అకౌంట్లను వినియోగిస్తున్నారు.
 
అయితే చాలా మంది ఏదో అవసరం కోసం జీ మెయిల్ అకౌంట్లను ఓపెన్ చేసి ఆ తర్వాత మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ మరిచిపోతున్నారు. మరల అవసరమైన సందర్భాల్లో కొత్త అకౌంట్లను క్రియేట్ చేసుకుంటున్నారు. దీంతో ఇన్‌యాక్టివ్ జీ మెయిల్ అకౌంట్లు ఎక్కువైపోయాయి. ఈ క్రమంలోనే ఇన్‌యావ్ అకౌంట్లను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. గూగుల్ తీసుకున్న నిర్ణయంతో ఎన్ని వేల మంది తమ జీ మెయిల్ అకౌంట్‌లను పునరుద్దరించుకుంటారో, ఎన్ని జీ మెయిల్ అకౌంట్‌లు మూసివేత (డిలీట్) కు గురవుతాయో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments