మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
గ్రహాల సంచారం ప్రతికూలంగా ఉంది. కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఓర్పుతో యత్నాలు సాగించండి. ఆశించిన పదవులు దక్కవు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. దైవకార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. బంధుమిత్రులతో అభిప్రాయభేదాలు. దంపతుల మధ్య సఖ్యతలోపం. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను నమ్మవద్దు. సంతానానికి శుభఫలితాలున్నాయి. ఆరోగ్యం చు సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. కొన్ని విషయాలు ఆసక్తి కలిగిస్తాయి. స్థిరచరాస్తుల వ్యవహారంలో మెలకువ వహించండి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో శ్రద్ధ వహించండి. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. ఉపాధి పథకాలు చేపడతారు. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు.
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఈ మాసం యోగదాయకం. ధనలాభం ఉంది. సంతోషకరమైన వార్తలు వింటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. మీ నమ్మకం ఫలిస్తుంది. కొత్తపనులు ప్రారంభిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం యత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. మీ జోక్యం అనివార్యం. ఉభయులకూ మీ సలహా ఆమోగయోగ్యమవుతుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ఉన్నతాధికారులకు స్థానచలనం. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కీలక వ్యవహారాల్లో ఆప్తుల ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. అర్థాంతంగా పనులు ముగిస్తారు. మీపై శకునాల ప్రభావం అధికం. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. సంకల్పబలమే మీ విజయానికి దోహదపడుతుంది. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. అవివాహితులు శుభవార్తలు వింటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఒక ఆహ్వానం ఉత్సాహపరుస్తుంది. ఉపాధి పథకాలు చేపడతారు. ఉపాధ్యాయులకు పదోన్నతి, పురస్కారయోగం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వేడుకలకు హాజరవుతారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. దైవకార్యాలకు వ్యయం చేస్తారు. కీలక వ్యవహారాలతో తీరిక ఉండదు. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. మీ శ్రీమతి సలహా పాటించండి. దూరపు బంధుత్వాలు బలపడతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఇదీ ఒకందుకు మంచికే. ఆటంకాలెదురైనా పట్టుదలతో మెలగండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను అధిగమిస్తారు.
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మీ గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. కార్యసాధనకు విపరీతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. విమర్శకులు మీ ప్రతిభను గుర్తిస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. దూరపు బంధువుల రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలు, ధార్మిక సంస్థలకు విరాళాలందిస్తారు.
కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యసిద్ధికి సంకల్పబలం ప్రధానం. ఆశావహదృక్పథంతో మెలగండి. అపజయాలకు కుంగిపోవద్దు. మనోబలం పెంచుకోండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చీటికిమాటికి అసహనం చెందుతారు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. మానసికంగా కుదుటపడతారు. ఈ ఇబ్బందులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. అయిన వారు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. గృహమార్పు కలిసివస్తుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగస్తులకు పనిభారం. వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను సమర్ధంగా ఎదుర్కుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
ఈ మాసం ప్రతికూలతలు అధికం. శారీరకశ్రమ అధికం. మీ కష్టం మరొకరికి ఫలితాన్నిస్తుంది. ఆలోచనలతో సతమతమవుతారు. ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త వహించండి. ఆప్తులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. అవసరాలకు అతికష్టంమ్మీద ధనం అందుతుంది. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా తెలియజేయండి. సంతానానికి శుభపరిణామాలున్నాయి. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఓర్పు ప్రధానం. అపజయాలకు కుంగిపోవద్దు. ఉద్యోగ బాధ్యతల్లో ఏమరుపాటు తగదు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ధార్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట,
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. యత్నాలకు కొంతమంది అడ్డుతగులుతారు. గుట్టుగా మెలగండి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఆశించిన పదవులు దక్కవు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. మానసికంగా కుదుటపడతారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. గృహంలో ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుంది. సంస్థల స్థాపనకు అనుమతులు మంజూరవుతాయి. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. అవివాహితులకు శుభసూచకం. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లను సరిదిద్దుకుంటారు. అధికారులకు హోదామార్పు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
ధనుర్ రాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అదృష్టయోగం ఉంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు సామాన్యం. కొంత మొత్తం పొదుపు చేస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. శుభకార్యం నిశ్చయమవుతుంది. కల్యాణ వేదికలు అన్వేషిస్తారు. గృహాలంకరణ పట్ల ఆసక్తి కలుగుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, కీలకపత్రాలు జాగ్రత్త. చేపట్టిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోండి. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. తరచూ ఆత్మీయులతో సంభాషిస్తారు. ప్రయాణంలో ఒకింత అవస్థలు తప్పవు
మకరరాశి : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
గ్రహాల సంచారం అనుకూలిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కివస్తాయి. మానసికంగా కుదుటపడతారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. సన్నిహితుల హితవు మీపై ప్రభావం చూపుతుంది. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. దంపతుల మధ్య చీటికిమాటికి కలహాలు. సామరస్యంగా మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. సంతానం యత్నాలు ఫలిస్తాయి. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవసరమవుతాయి. వ్యాపారాల్లో ఆటంకాలను అధిగమిస్తారు. చిరువ్యాపారులకు నిరాశాజనకం. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ఉపాధ్యాయులకు శుభయోగం. విందులు, వినోదాల్లో అందరినీ ఆకట్టుకుంటారు.
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసిద్ధికి సంకల్పబలం ప్రధానం. ధైర్యంగా యత్నాలు కొనసాగించండి. ఆప్తుల ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ముఖ్యులను కలిసినా ప్రయోజనం ఉండదు. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించండి. దంపతుల మధ్య చీటికిమాటికి కలహాలు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. సంతానం దూకుడు అదుపుచేయండి. కొత్త సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిన్నవ్యాపారారులకు నిరాశాజనకం. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. వ్యవసాయ కూలీలకు పనులు లభిస్తాయి. నెలాఖరులో శుభవార్తలు వింటారు.
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంప్రదింపులు ముందుకు సాగవు. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు అధికం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. అయిన వారు మీ అసక్తతను అర్థం చేసుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవప్రతిష్టలకు భంగం కలుగకుండా మెలగండి. కీలకపత్రాలు, నగదు జాగ్రత్త. సంతానం విద్యాయత్నాలు ఫలిస్తాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. సొంత వ్యాపారాలపైనే దృష్టిపెట్టండి. ఉద్యోగస్తులకు పనియందు ధ్యాస ప్రధానం. ప్రలోభాలకు లొంగవద్దు. ముఖ్యులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు.