Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఎస్సీ నర్సింగ్ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌...యంయల్‌హెచ్‌పి ఉద్యోగాలకు అర్హత

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (09:42 IST)
రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో విడుదల చేసిన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఉద్యోగాలకు బీఎస్సీ నర్సింగ్ తోపాటు అదనంగా కమ్యూనిటీ హెల్త్ సర్టిఫికెట్ ఉన్నవాళ్లు మాత్రమే అర్హులుగా పరిగణిస్తూ, వారు మాత్రమే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ విడుదల చేసింది. 
 
 
నోటిఫికేషన్ ప్రకారం 2020 సంవత్సరం లో బియస్సి నర్సింగ్ పాసైన అభ్యర్థులు మాత్రమే ఉద్యోగాలకు అర్హులు. దీంతో దాదాపు లక్ష మంది బీఎస్సీ నర్సింగ్ చదివిన అభ్యర్థులు ఆశలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీవ్ర నిరాశకు గురి చెయ్యడం తో ఈ విషయాన్ని సవాల్ చేస్తూ బీఎస్సీ నర్సింగ్ చదివిన ప్రతి ఒక్కరికి యం యల్  హేచ్ పి ఉద్యోగాలకు అర్హత కలిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ కి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ విద్యార్థి ఫెడరేషన్ హైకోర్టులో పిల్ దాఖలు చేయడంతో పాటు యువ న్యాయవాది గుడిపాటి శ్రీహర్ష  బాధితుల పక్షాన బలంగా వాదనలు వినిపించడం తో  వాదనలు విన్న హైకోర్ట్ బీఎస్సీ నర్సింగ్ చదివిన ప్రతి ఒక్కరు  యం యల్ హేచ్ పి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ఆదేశాలు జారీ చేసింది. 
 
 
ఈ సందర్భంగా ఏ పీ ఎన్ ఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు స్వచ్ఛంద ప్రసాద్ మాట్లాడుతూ బీఎస్సీ నర్సింగ్ చదివి దాదాపు లక్ష మంది నిరుద్యోగులు ఎంతో ఆశతో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన యం యల్ హచ్ పి నోటిఫికేషన్ ఆందోళనకు గురి చేసిందన్నారు. తప్పని పరిస్థితి లో కోర్టును ఆశ్రయించగా అభ్యర్థులకు అనుకూలం గా కోర్టు నిర్ణయం తీసుకోవడం గొప్ప విజయం అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments