Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈదురుగాలులు, వ‌ర్షంతో... ఆకాశం నుంచి జారిపడ్డ ‘స్వర్ణశిల...!!

Webdunia
సోమవారం, 27 సెప్టెంబరు 2021 (11:48 IST)
ఆకాశం నుంచి అప్పుడ‌పుడూ ఉల్క‌లు రాలిప‌డుతుంటాయి. అరుదుగా ఒక్కోసారి రాళ్ళు కూడా ప‌డుతుంటాయి. అవి ఉప‌గ్ర‌హాల శ‌క‌లాలు కావ‌చ్చు. మ‌రోటి కావ‌చ్చు. కానీ ఆకాశం నుంచి ఓ పెద్ద రాయి ప‌డింద‌ట‌. అదీ స్వర్ణ శిల అంటున్నారు అక్క‌డ రైతులు.
 
మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌ జిల్లా వశి తాలుకాలో ఆకాశం నుంచి అరుదైన రాయి కింద పడింది. స్థానిక రైతు ప్రభు నివృతి మాలి ఉదయం 6.30 గంటలకు పొలంలో పని చేసుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో ఈదురు గాలుల మధ్య భారీ శబ్దంతో ఓ రాయి ఆయనకు ఎనిమిది అడుగుల దూరంలో పడింది! అదే మీద ప‌డితే ఆయ‌న బ‌లి అయిపోయేవారే!
 
వెంటనే తహసీల్దార్‌ నర్సింగ్‌ జాదవ్‌కు ప్రభు సమాచారం ఇచ్చారు. అధికారులు పొలం వద్దకు వచ్చి రాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏడు అంగుళాల పొడవు, ఆరు అంగుళాల వెడల్పుతో ఉన్న ఈ రాయి బరువు 2.38 కేజీలు ఉన్నట్లు గుర్తించారు.
 
తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రాథమిక తనిఖీ పూర్తైన తర్వాత, ఈ రాయిని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులకు పంపించారు. రంగును బట్టి కొందరు ఈ రాయిని బంగారు శిలగా అభివర్ణిస్తున్నారు ఇక్క‌డి రైతులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హ్యాట్సాఫ్ కింగ్ నాగార్జున.. నెట్టేసిన ఫ్యాన్‌ను కలిశాడు.. (వీడియో)

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments