Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆకాశం నుంచి జారిపడ్డ ‘స్వర్ణశిల’

Advertiesment
Gold stone
మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌ జిల్లా వశి తాలుకాలో ఆకాశం నుంచి అరుదైన రాయి కింద పడింది. స్థానిక రైతు ప్రభు నివృతి మాలి శుక్రవారం ఉదయం 6.30 గంటలకు పొలంలో పని చేసుకుంటున్నారు.

సరిగ్గా అదే సమయంలో ఈదురు గాలుల మధ్య భారీ శబ్దంతో ఓ రాయి ఆయనకు ఎనిమిది అడుగుల దూరంలో పడింది. వెంటనే తహసీల్దార్‌ నర్సింగ్‌ జాదవ్‌కు ప్రభు సమాచారం ఇచ్చారు. అధికారులు పొలం వద్దకు వచ్చి రాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఏడు అంగుళాల పొడవు, ఆరు అంగుళాల వెడల్పుతో ఉన్న ఈ రాయి బరువు 2.38 కేజీలు ఉన్నట్లు గుర్తించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రాథమిక తనిఖీ పూర్తైన తర్వాత.. ఈ రాయిని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులకు పంపించారు. రంగును బట్టి కొందరు ఈ రాయిని బంగారు శిలగా అభివర్ణిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల బ్రహ్మోత్సవాలలో ఎప్పుడేం జరుగుతుందంటే...!?