Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమల బ్రహ్మోత్సవాలలో ఎప్పుడేం జరుగుతుందంటే...!?

Advertiesment
Brahmotsavaas
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం ఖరారు చేసింది. అక్టోబర్‌ 7వ తేదీ నుంచి 15 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు తెలిపింది.

కొవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఏడాది కూడా ఏకాంతంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తితిదే పేర్కొంది. ఈ మేరకు అక్టోబర్‌ 5న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని జరపనున్నట్లు వెల్లడించింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి వాహనసేవల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
 
ఏ రోజు.. ఏ సేవ.. 
06-10-2021: అంకురార్పణ (సాయంత్రం 6 నుంచి 7 గంటల వ‌ర‌కు)
07-10-2021: ధ్వజారోహణం (ఉదయం)  - పెద్దశేష వాహనసేవ (సాయంత్రం)
08-10-2021: చిన్నశేష వాహ‌నసేవ (ఉదయం)  - హంస వాహనసేవ (సాయంత్రం)
09-10-2021: సింహ వాహ‌న సేవ (ఉదయం)- ముత్యపుపందిరి వాహ‌న సేవల (సాయంత్రం)
10-10-2021:  క‌ల్పవృక్ష వాహ‌నసేవ (ఉదయం)- సర్వభూపాల వాహనసేవ (సాయంత్రం)
11-10-2021: మోహినీ అవ‌తారం (ఉదయం)- గ‌రుడ‌ వాహనసేవ‌ (సాయంత్రం)
12-10-2021: హ‌నుమంత వాహ‌నసేవ (ఉదయం)- గ‌జ వాహ‌నసేవ (సాయంత్రం)
13-10-2021: సూర్యప్రభ వాహ‌నసేవ (ఉదయం)- చంద్రప్రభ వాహ‌నసేవ (సాయంత్రం)
14-10-2021: రథోత్సవానికి బ‌దులుగా సర్వభూపాల వాహనసేవ (ఉదయం)- అశ్వ వాహ‌నసేవ (సాయంత్రం)
15-10-2021: ప‌ల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం (ఉదయం)- ధ్వజారోహణం (సాయంత్రం)

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒరేయ్‌ సన్నాసిన్నర సన్నాసి...పవన్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన మంత్రి పేర్ని