Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిలియనీర్ కావాలని నిండు గర్భణి గొంతుకోసిన భర్త...

మూఢనమ్మకం ఓ నిండు గర్భిణి ప్రాణాలు తీసింది. ఈ దారుణానికి పాల్పడింది కూడా కట్టుకున్న భర్తే. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు ఓ స్వామీజీ ఇచ్చిన సలహాతో భార్య గొంతుకోసి చంపేశాడు కట్టుకున్న భర్త.

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (09:17 IST)
మూఢనమ్మకం ఓ నిండు గర్భిణి ప్రాణాలు తీసింది. ఈ దారుణానికి పాల్పడింది కూడా కట్టుకున్న భర్తే. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు ఓ స్వామీజీ ఇచ్చిన సలహాతో భార్య గొంతుకోసి చంపేశాడు కట్టుకున్న భర్త. అంటే మూఢనమ్మకం పేరిట హత్యకు పాల్పడ్డాడు. ఈనెల 19వ తేదీన పుదుచ్చేరిలో జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
పుదుచ్చేరికి చెందిన ఓ వ్యక్తికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈయనకు మూఢ నమ్మకాలు ఎక్కువ. అదేసమయంలో ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. దీంతో తన కష్టాలు పోగొట్టుకునేందుకు ఓ స్వామీజీని ఆశ్రయించాడు. మహిళను బలిస్తే ఆర్థిక కష్టాలు తీరిపోవడమేకాకుండా సంపద సమకూరుతుందని చెప్పాడు. ఆ స్వామీజీ మాటలు నమ్మిన ఆ వ్యక్తి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా తన భార్యనే బలిగా ఇచ్చాడు. 
 
తన భార్య గొంతు కోసి పొదల్లో పడేసి.. ఏమీ ఎరగనట్టు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తొలుత నిందితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. బాధితురాలి జాడ కనుగొనడానికి ప్రయత్నించిన పోలీసులకు ఊరి శివార్లలో ఆమె దేహం కనిపించింది. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
ఈ విచారణలో మృతురాలి భర్తకు మూఢనమ్మకాలు ఎక్కువని తెలుసుకున్నారు. ఆ తర్వాత అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారణ జరపడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఓ స్వామిజీ ఇచ్చిన సలహా మేరకు తాను ఇంత దారుణానికి పాల్పడినట్లు తెలిపాడు. 
 
ఈ దారుణానికి పాల్పడిన ఘటనలో తాను మరో ఐదుగురు వ్యక్తుల సహాయం తీసుకున్నట్లు నిందితుడు తెలిపాడు. వారందరినీ పోలీసులు అరెస్టు చేశారు. అలాగే గర్భిణీ స్త్రీని బలివ్వాలని సలహా ఇచ్చిన స్వామిజీ ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments