Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే ఈ-టిక్కెట్‌పై రూపాయి చెల్లిస్తే చాలు.. రూ.10 లక్షల బీమా

ప్రయాణికుల కోసం రైల్వే శాఖ సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. కొన్ని బీమా సంస్థలతో కలిసి ఈ స్కీమ్‌ను అమల్లోకి తెచ్చింది. అదేసమయంలో తన ఖర్చుల భారాన్ని కూడా తగ్గించుకునేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింద

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (09:05 IST)
ప్రయాణికుల కోసం రైల్వే శాఖ సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. కొన్ని బీమా సంస్థలతో కలిసి ఈ స్కీమ్‌ను అమల్లోకి తెచ్చింది. అదేసమయంలో తన ఖర్చుల భారాన్ని కూడా తగ్గించుకునేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా రైలు ప్రయాణికులకు బీమా సౌకర్యాన్ని కల్పించింది.
 
ఈ-టికెట్‌ తీసుకునే ప్రయాణికులకు బీమాను ఆప్షన్‌‌గా మార్చింది. ఇకపై ఆన్‌లైన్‌లో ఐఆర్‌‌సీటీసీ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకునే ప్రయాణికులకు బీమా కావాలా? వద్దా అనేది వారి ఇష్టానికే వదిలేసింది. టికెట్‌ కోసం వివరాలు సమర్పించే సమయంలో ఇన్సూరెన్స్‌ కూడా ఒక ఆప్షన్‌గా ఇస్తుంది. కావాల్సిన వారికి రూ.1 అదనంగా వసూలు చేస్తారు.
 
ఆన్‌లైన్‌ విధానంలో టికెట్‌ బుకింగ్‌లను ప్రోత్సహించేందుకు 2017 డిసెంబర్‌ నుంచి ప్రయాణికులకు ఉచిత బీమా రైల్వేశాఖ అమలు చేస్తోంది. ఈ విధానం ఈ నెల 2 వరకు కొనసాగింది. దాదాపు 9 నెలల పాటు ప్రయాణికులకు ఉచిత బీమా సదుపాయం కల్పించింది. ఖర్చులు పెరిగిపోవడంతో ఇటీవల ఈ విధానానికి స్వస్తి పలికి కొత్త విధానాన్ని తెచ్చింది. 
 
స్లీపర్, ఏసీ, చెైర్‌ కార్‌ సీట్ల కోసం టికెట్లు బుక్‌ చేసే ప్రయాణికులు బీమా కావాలా వద్దా? అన్నది ఇకపై వారికే వదిలేసింది. దీనికోసం ఐసీఐసీఐ, సుందరం, శ్రీరామ్‌ ఫైనాన్స్‌లాంటి సంస్థలతో రైల్వే శాఖ ఓ ఒప్పందం కుదుర్చుకుంది. బీమా తీసుకున్న ప్రయాణికులు ప్రమాదవశాత్తూ చనిపోతే.. రూ.10 లక్షల పరిహారం చెల్లిస్తారు. శాశ్వతంగా అంగవైకల్యానికి గురైతే రూ.7.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల వరకు పరిహారం లభిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

ఐఎఫ్‌ఎఫ్‌ఐలో ప్రదర్శించబడుతుందని ఎప్పుడూ ఊహించలేదు : రానా దగ్గుబాటి

పోసాని క్షమార్హులు కాదు... ఆయనది పగటి వేషం : నిర్మాత ఎస్కేఎన్

తండేల్ నుంచి నాగ చైతన్య, సాయి పల్లవిల బుజ్జి తల్లి రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం