Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికను పశువుల పాకలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం...

Webdunia
ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (11:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. ఓ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన జిల్లాలోని కృత్తివెన్ను మండలంలోని ఓ పంచాయతీ పరిధిలో జరిగింది. 
 
స్థానికంగా సంచలనం రేపిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 14 ఏళ్ల బాధిత బాలిక తొమ్మిదో తరగతి చదివి ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటోంది. అదేప్రాంతానికి చెందిన వివాహితుడైన పి.అనంతబాబు, జి.తరుణ్‌తోపాటు ఓ బాలుడు కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
గురువారం రాత్రి తమ ఇంటి సమీపంలోని పశువుల పాకలోకి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టు బాధిత బాలిక తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ముగ్గురిని అరెస్టు చేసి బంటుమిల్లి ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ కోర్టుకు అప్పగించారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను మచిలీపట్టణం జిల్లా ఆసుపత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Murugadoss: దాని వల్లే ఐదేళ్ల టైం వృథా అయింది. మన దగ్గర ప్రపంచస్థాయి కంటెంట్ వుంది : ఏఆర్ మురుగదాస్

Sri Vishnu: గతంలో రిలీజ్ కు సురేష్ బాబు, దిల్ రాజు, ఇప్పుడు బన్నీ వాస్ వున్నారు : శ్రీ విష్ణు

Anushka : అందుకే సినిమాలు తగ్గించా.. ప్రస్తుతం మహాభారతం చదువుతున్నా : అనుష్క శెట్టి

కిష్కింధపురి సినిమా చూస్తున్నప్పుడు ఫోన్ చూడాలనిపించదు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

జటాధర లో శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌ చేసింది : నిర్మాత ప్రేరణ అరోరా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

తర్వాతి కథనం
Show comments