Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోసానిది అనవసర రాద్ధాంతం.. నందికి కులాలా?: వైసీపీ నేత

నంది అవార్డులపై వివాదం కొనసాగుతోంది. వాస్తవానికి నంది అవార్డులపై ఎలాంటి వివాదం లేదని.. అవార్డుల్లో కులాలకు స్థానం లేదని వైసీపీ నేత ఘట్టమనేని ఆదిశేషగిరి రావు అన్నారు. నంది అవార్డులపై స్పందించిన ఆయన.. న

Webdunia
బుధవారం, 22 నవంబరు 2017 (17:12 IST)
నంది అవార్డులపై వివాదం కొనసాగుతోంది. వాస్తవానికి నంది అవార్డులపై ఎలాంటి వివాదం లేదని.. అవార్డుల్లో కులాలకు స్థానం లేదని వైసీపీ నేత ఘట్టమనేని ఆదిశేషగిరి రావు అన్నారు. నంది అవార్డులపై స్పందించిన ఆయన.. నంది అవార్డులు రానివారు రచ్చ చేయడం మామూలేనని.. ఒక్కసారి అవార్డులను ప్రకటించిన తర్వాత.. వాటిని వెనక్కి తీసుకోవడం ఉండదన్నారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అవార్డులపై ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. అవార్డుల్లో కులాలకు స్థానం వుండదన్నారు. 
 
కాగా.. నంది అవార్డుల విమర్శలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించినట్టు వార్తలొచ్చాయి. ఏపీలో ఆధార్ కార్డు లేని వారు మాట్లాడుతున్నారని, వారంతా ఎన్ఆర్ఏ అంటే నాన్ రెసిడెంట్ ఆంధ్ర అని లోకేశ్ వ్యాఖ్యనించినట్టు ఓ వార్తా సంస్థ ప్రచురించింది. లోకేష్ వ్యాఖ్యలపై సినీ నటుడు, రచయత, దర్శకుడు పోసాని కృష్ణ మురళి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 
 
తాను నంది అవార్డును స్వీకరిస్తే 'కమ్మోడివి కాబట్టే అవార్డు వచ్చిందా' అంటారని... అందుకే అవార్డును తిరస్కరిస్తున్నానని పోసాని వ్యాఖ్యానించారు. ఇంక నంది అవార్డులను రద్దు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments