Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖరీదైన చాక్లెట్ ఆశ చూసి.. స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్...

ప్రేమ పేరుతో 10వ తరగతి బాలికను మోసం చేసి అత్యాచారం చేయడమే గాకుండా స్నేహితులనూ ఈ దారుణంలో భాగస్వామ్యం చేసిన ఘటన గుంటూరులో వెలుగులోకి వచ్చింది. ఏడాది కాలంగా బాలికపై అత్యాచారానికి పాల్పడడంతో ఎట్టకేలకు బాధితురాలు నోరు విప్పింది. గుంటూరులోని స్వర్ణభారతీ న

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (19:47 IST)
ప్రేమ పేరుతో 10వ తరగతి బాలికను మోసం చేసి అత్యాచారం చేయడమే గాకుండా స్నేహితులనూ ఈ దారుణంలో భాగస్వామ్యం చేసిన ఘటన గుంటూరులో వెలుగులోకి వచ్చింది. ఏడాది కాలంగా బాలికపై అత్యాచారానికి పాల్పడడంతో ఎట్టకేలకు బాధితురాలు నోరు విప్పింది. గుంటూరులోని స్వర్ణభారతీ నగర్‌కు చెందిన బాలిక నగరంపాలెం ఓ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఆ బాలిక ఇంటి దగ్గిరలో ఉండే త్రినాథ్‌ కూలి పనులు చేస్తున్నాడు. ఆమెకు ఖరీదైన చాక్లెట్లు ఇతర బహుమతులు ఇచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ నిర్జన ప్రదేశంలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. 
 
ఆ తర్వాత విషయాన్ని తన స్నేహితులకూ చెప్పి సామూహికంగా అత్యాచారం చేశారు. ఈ ఘటనను చరవాణిలో చిత్రీకరించారు. ఆ విషయాన్ని బయటకి చెపితే ఆ వీడియోలు, ఫొటోలు ఇంటర్నెట్‌లో పెడతామంటూ బెదిరించారు. దీంతో ఆ బాలిక మిన్నకుండిపోయింది. కొద్ది నెలలుగా వారిద్దరు ఆ బాలికను బెదిరిస్తూ లొంగదీసుకుంటున్నారు. కొద్దిరోజుల తర్వాత త్రినాథ్ ద్వారా బాలిక విషయం తెలుసుకున్న మరో ఇద్దరు స్నేహితులు ఓ రోజు ఆమెను బెదిరించి రాజీవ్‌గృహకల్ప బహుళ నివాసాలు ఉన్న ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు. 
 
ఏడాది కాలంగా ఇదే తరహాలో ఒకరి నుంచి మరొకరు స్నేహితులు సమాచారం చేరవేసుకొని ఆ బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడుతుండటంతో బాధితురాలు విషయాన్ని ఇంట్లో చెప్పింది. దీంతో బాధితురాలి తల్లి నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన గుంటూరు అర్బన్ పోలీసులు ఈ దారుణంలో ఇంకా ఎవరున్నారు అనే కోణంలో పూర్త దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం