నేను లోక్‌సభలో సెంచరీ కొట్టాను.. ఫుల్ ఛార్జింగ్‌లో వున్నా: గల్లా ఘాటు రిప్లై

జనసేన పార్టీతో పాటు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ల మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. వన్డే మ్యాచ్ తరహాలో ఒక్కసారి లోక్‌సభలో మాట్లాడి మౌనం పాటిస్తున్నారని.. దీనివెనుక గల మర్మమే

Webdunia
శనివారం, 28 ఏప్రియల్ 2018 (13:06 IST)
జనసేన పార్టీతో పాటు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ల మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. వన్డే మ్యాచ్ తరహాలో ఒక్కసారి లోక్‌సభలో మాట్లాడి మౌనం పాటిస్తున్నారని.. దీనివెనుక గల మర్మమేమటని పవన్ పార్టీ జనసేన ట్వీట్ చేసింది. బ్యాటరీ డౌన్ అయిన మాటలు మానేసి ప్రత్యేక హోదా తెచ్చే మార్గాలను ఆలోచించాలని ఎద్దేవా చేసింది. 
 
ఈ ట్వీట్‌కు గల్లా జయదేవ్ అదిరిపోయే రిప్లై ఇచ్చారు. తాను లోక్‌సభలో సెంచరీ కొట్టానని.. గత నాలుగేళ్లలో ఇప్పటిదాకా వందసార్లు మాట్లాడానని ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రం మీద, ప్రధానిపైన యుద్ధం చేస్తూనే ఉన్నామని అందులో పేర్కొన్నారు. 
 
అంతేగాకుండా పవన్ మాత్రం ప్రధానిపై ఎందుకు ఆధారపడుతున్నారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. పవన్ ఇంతకీ ఎవరిపై ఫైట్ చేస్తున్నారో క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమ బ్యాటరీలు ఎప్పుడూ ఫుల్ చార్జింగ్‌తో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అయ్యింది. 
 
అంతకుముందు తొలుత జయదేవ్.. త్వరలో కొత్త సినిమా విడుదల కాబోతోందని, జగన్-పవన్ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రానికి కథ, దర్శకత్వం ప్రశాంత్ కిశోర్ అని, మోడీ-షా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఈ సినిమా విడుదల కాబోతోందని సెటైర్లు వేస్తూ ట్వీట్ చేస్తే అది కాస్తా వైరల్‌గా మారిపోయింది. దీనికి స్పందించిన జనసేన శుక్రవారం బ్యాటరీ డౌన్ మాటలు మాట్లాడొద్దని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు గల్లా ఘాటు రిప్లై ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments