Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్ కళ్యాణ్ "ఖుషి"కి 17 యేళ్లు (Trailer)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం 'ఖుషి'. ఈ చిత్రం గత 2001 ఏప్రిల్ 27వ తేదీన విడుదలైంది. ఈ చిత్రం విడుదలై నేటికి 17 యేళ్లు. తమిళ దర్శకుడు ఎస్.జె.సూర్య తెరకెక్కించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ రాయ్.

Advertiesment
పవన్ కళ్యాణ్
, శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (13:15 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం 'ఖుషి'. ఈ చిత్రం గత 2001 ఏప్రిల్ 27వ తేదీన విడుదలైంది. ఈ చిత్రం విడుదలై నేటికి 17 యేళ్లు. తమిళ దర్శకుడు ఎస్.జె.సూర్య తెరకెక్కించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ రాయ్.. సిద్ధార్థ్ రాయ్ పాత్రలో నటించారు. హీరోయిన్ భూమిక.
 
ఇందులో ప‌వ‌న్ మేన‌రిజం, ఆయ‌న చెప్పిన డైలాగ్స్‌, ఫైట్స్‌కి ఫిదా కాని ఫ్యాన్స్ లేరంటే అతిశయోక్తి కాదు. ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని అల‌రించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ చిత్రం యువ‌త‌రం ప్రేమ‌క‌థ‌ల‌కి, స్టైల్స్‌కి ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది.
webdunia
 
ఈ సంద‌ర్భంగా ఆ చిత్ర నిర్మాత, సూర్యా మూవీస్ అధినేత ఎం.ఎం.మ‌ణిర‌త్నం శుక్రవారం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని క‌లిసి భారీ పుష్ప‌గుచ్చం అందించి త‌న సంతోషాన్ని పంచుకున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతం చిత్రాన్ని ఓ రేంజ్‌లో నిలిచేలా చేసింది. ఈ చిత్రంలోని పాటలన్నీ మంచి ప్రేక్షకాదరణ పొందాయి. ఇక ఆడవారి మాట‌ల‌కి అర్థాలే వేరులే అనే అల‌నాటి గీతం రీమిక్స్ వ‌ర్షెన్ అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సూపర్ స్టార్ రజనీకాంత్‌తో విజయ్ సేతుపతి.. విలన్‌గా ఇరగదీస్తాడట..