Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 26 April 2025
webdunia

పవనూ ట్వీట్లు చేస్తూ కూర్చోవడం వల్ల పైసా ప్రయోజనం వుండదు: శ్రీధర్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై ప్రముఖ సాంకేతిక నిపుణుడు నల్లమోతు శ్రీధర్ ఫైరయ్యారు. జనసేనాని పవన్ అభిమానులపైన కూడా శ్రీధర్ మండిపడ్డారు. ప్రశ్నిస్తున్నామనే పేరుతో ద్వేషభావాన్ని పెంపొందించేవారు అభిమానులు క

Advertiesment
Sridhar
, శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (11:00 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై ప్రముఖ సాంకేతిక నిపుణుడు నల్లమోతు శ్రీధర్ ఫైరయ్యారు. జనసేనాని పవన్ అభిమానులపైన కూడా శ్రీధర్ మండిపడ్డారు. ప్రశ్నిస్తున్నామనే పేరుతో ద్వేషభావాన్ని పెంపొందించేవారు అభిమానులు కాబోరని.. శ్రీధర్ తెలిపారు. పవన్ ఫ్యాన్స్ మరీ దిగజారి ప్రవర్తిస్తున్నారన్నారు. నాయకుడు ఎవరినైనా తిడితే దానిని మోసుకుతిరగే వారు.. కాస్తంత సమాజంపై దృష్టి పెడితే బాగుంటుందని శ్రీధర్ సూచించారు. 
 
సామాజిక విషయాలపై దృష్టి పెట్టకుండా.. ట్వీట్లు చేస్తూ కూర్చోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం వుండదని శ్రీధర్ చెప్పుకొచ్చారు. ఓట్లు కావాలకున్న వ్యక్తి  తొలుత ప్రజలకు ఏదైనా చేసి మాట్లాడాలని హితవు పలికారు. 
 
ఇలా అభిమానులను అడ్డం పెట్టుకుని విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని పవన్‌ను ఉద్దేశించి శ్రీధర్ పేర్కొన్నారు. శ్రీకాకుళంలో ఉద్దానం వంటి ఒకటి రెండు సమస్యల గురించి తప్ప పవన్ ఇంక దేని గురించి పట్టించుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కానని శ్రీధర్ అన్నారు. ఓ సామాన్య పౌరుడిగా ఇది తన ఆవేదన మాత్రమేనని తెలిపారు. 
 
ఇదిలా ఉంటే ప్రజల వద్దకు వెళ్లాలనే తన సంకల్పాన్ని ఎవ్వరూ వమ్ము చేయలేరని.. జనసేన పార్టీ అధినేత పవన్ చెప్పారు. జిల్లాలలో సుదీర్ఘమైన పర్యటనలు జరపడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. జిల్లాలలో ప్రధాన సమస్యలు, రాష్ట్ర అభివృద్ధిలో  తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యాలు, ప్రత్యేక హోదా సాధన ధ్యేయంగా జిల్లాలలో పర్యటిస్తానని స్పష్టం చేశారు. తన సుదీర్ఘ పర్యటనల కోసం వివిధ కమిటీలను పార్టీ ముఖ్యులు ఏర్పాటు చేస్తున్నారని, జిల్లాల పర్యటన రెండు మూడు వారాలలో ప్రారంభం అయ్యే విధంగా సన్నాహాలు జరుగుతున్నాయని పవన్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలా చేయమని నా భర్త చెప్పాడు.. అలా చేశాను : కరీనా కపూర్