ఏసీబీ వ‌ల‌లో అట‌వీశాఖ అధికారిణి

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (08:37 IST)
ఏసీబీ వలలో కృష్ణాజిల్లా మైలవరం ఫారెస్ట్ రేంజ్, ఏ.కొండూరు ఫారెస్ట్ సెక్షన్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కె.శేషకుమారి లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డ్డారు.

ఆదివారం మ‌ధ్యాహ్నం ఒంటి గంట స‌మ‌యంలో కె.శేషకుమారి, ఆమె భర్త  సుధాకర్ (ప్రైవేట్ ఎంప్లాయ్) ఇద్దరూ క‌లిసి ఫిర్యాది అయిన జె.యేసు నాయక్, రుద్రవరం గ్రామం, రెడ్డిగూడెం మండలం, కృష్ణాజిల్లా వద్ద నుండి నాలుగు ఎకరాల ఫారెస్ట్ పొలం సాగు చేయుటకు రూఫ‌ర్ పట్టా కోసం జీపీఎస్ సర్వే నిర్వహించేందుకుగాను రూ.ల‌క్ష డిమాండ్ చేసరు.

మొదటి విడతగా రూ.50వేలు లంచంగా అడిగి తీసుకుంటుండగా విజయవాడ అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

లంచం డబ్బు మరియు సంబంధిత రికార్డులను స్వాధీనపర్చుకున్నారు. నిందితుడిని విజయవాడ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పరచనున్నారు. కేసు దర్యాప్తులో ఉంద‌ని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments