Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యాత్రికుల ఫీడ్ బ్యాక్ పై ప్రత్యేక దృష్టి: టీటీడీ అధికారులకు ఈఓ ఆదేశం

యాత్రికుల ఫీడ్ బ్యాక్ పై ప్రత్యేక దృష్టి: టీటీడీ అధికారులకు ఈఓ ఆదేశం
, గురువారం, 19 నవంబరు 2020 (08:22 IST)
టీటీడీ యాత్రికులకు అందిస్తున్న సేవలు, పాలన వ్యవహారాలకు సంబంధించి మెయిల్స్, కాల్ సెంటర్, డయల్ యువర్ ఈఓ ద్వారా వచ్చే సలహాలు,సూచనలు,ఫిర్యాదుల మీద దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఈఓ  డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

టీటీడీ పరిపాలన భవనం లోని సమావేశ మందిరంలో ఆయన ఐటి విభాగంపై  అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ప్రస్తుతం ఉన్న వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ విభాగాలకు సంబంధించి పెండింగులో ఉన్న సాఫ్ట్వేర్ అప్లికేషన్లను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

సివిల్ ఇంజనీరింగ్ విభాగం నిర్వహణలో ఐటి పరిజ్ఞానాన్ని మరింతగా పెంచడం పై దృస్థి పెట్టాలని ఈఓ సూచించారు. మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి ప్రత్యేక అప్లికేషన్ తయారు చేయాలని ఐటి అధికారులను ఆదేశించారు. మార్కెట్ లో సరుకుల ధరలు, డిమాండ్, సరఫరాకు సంబంధించిన వివరాలన్నీ తెలుసుకుని, ఇందుకు తగ్గట్టు సరుకులు కొనుగోలు చేయగలిగేలా ఒక అప్లికేషన్ రూపొందించాలన్నారు.

ఆసుపత్రుల నిర్వహణకు ప్రత్యేక అప్లికేషన్ ఉండాలన్నారు. టీటీడీకి అద్దెలు చెల్లించాల్సిన వారికి గడువుకు ముందే అలర్ట్ మెసేజ్ పంపే వ్యవస్థ అమలు చేయాలని ఆదేశించారు. ఉద్యోగులకు సంబంధించిన సమస్త సమాచారంతో టీటీడీ నిర్వహిస్తున్న డేటా అప్డేట్ చేయాలని ఆయన చెప్పారు. రికార్డులన్నీ  డిజిటలైజ్ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు.

సైబర్ సెక్యూరిటీ పాలసీ మీద సివి ఎస్ ఓ గోపీనాథ్ జెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.  అదనపు ఈఓ  ధర్మారెడ్డి, జెఈఓ సదా భార్గవి, ఎఫ్ఏ అండ్ సీఎఓ బాలాజి, చీఫ్ ఇంజినీర్ రమేష్ రెడ్డి, ఐటి విభాగాధిపతి  శేషారెడ్డి తో పాటు పలువురు అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.       
 
సీనియర్ సిటిజన్ల దర్శనంపై సోషల్ మీడియాలో అవాస్తవ ప్రచారం:
సీనియర్ సిటిజన్లకు తిరుమల శ్రీవారి దర్శనానికి  రెండు స్లాట్లు కేటాయించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం వాస్తవం కాదు. కోవిడ్ 19 నిబంధనల మేరకు 10 ఏళ్ల లోపు పిల్లలను, 65 ఏళ్ళు దాటిన వారిని శ్రీవారి దర్శనానికి అనుమతించడం లేదు. సోషల్ మీడియా లో వస్తున్న ప్రచారాన్ని భక్తులు విశ్వసించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హిందువుల మనోభావాలు దెబ్బతినేలా తుంగభద్ర పుష్కరాల నిర్వహణ: టీడీపీ