వలసకార్మికులను తరలించే శ్రామిక్ రైళ్లతో పాటు జూన్ 1 నుండి ప్యాసింజర్ రైళ్లను కూడా నడపనుంది. వీటికి సంబంధించి టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని రైల్వేశాఖ తెలిపింది.
ప్రస్తుతం ఉన్న 15 రైళ్లతో పాటు 200 అదనపు రైళ్లలో సెకండ్ క్లాస్ బోగీలను కూడా అనుమతించినట్లు పేర్కొంది. రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అందుబాటులో ఉంచుతామని రైల్వే శాఖ పేర్కొంది. ఈ నెల 12 నుండి అనుమతించిన 15 ప్రత్యేక రైళ్లు ఎసిబోగీలతో మాత్రమే ప్రయాణించిన సంగతి తెలిసిందే.
అలాగే ప్రయాణికులు మాస్కులు ధరించడం, శానిటైజర్లను వినియోగించడం, భౌతిక దూరం వంటి ఆదేశాలను విధిగా పాటించాల్సిందేనని సూచించింది.
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పొడిగించినట్లు కేంద్రం ఆదేశించినప్పటికీ, బస్సు సర్వీసులు, ఇతర ప్రజా రవాణాపై నిషేధాన్ని ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే తుది నిర్ణయాన్ని మాత్రం ఆయా రాష్ట్రాలకే వదిలేసింది. కాగా, లాక్‌డౌన్‌కు ముందు దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 12 వేల రైళ్లు ప్రయాణించేవి.