Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.11 కోట్ల సామగ్రి స్వాహా.. ఏడుగురికి గాయాలు

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2022 (14:54 IST)
విశాఖలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షిప్పింగ్ గోదాములో ఏర్పడిన ఈ అగ్నిప్రమాదం ద్వారా తానా పంపిన రూ.11 కోట్ల కొవిడ్ సామగ్రి కాలి బూడిద అయ్యింది. ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. విశాఖ పెదగంట్యాడలోని శ్రావణి షిప్పింగ్ గోదాములో కరోనా మహమ్మారి సమయంలో తెలుగు ప్రజలకు పంపిణీ చేసేందుకు వీలుగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ఈ సామగ్రిని సేకరించి పంపించింది.

ఇందులో శానిటైజర్లు, గ్లౌజులు, మాస్కులు, ఇతర సామగ్రి ఉన్నాయి. కెనడా నుంచి రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా గతేడాది డిసెంబరులో ఈ సామగ్రిని దిగుమతి చేసుకున్నారు. 
 
రాష్ట్రంలోని ఆరోగ్య కేంద్రాలకు గవర్నర్ చేతుల మీదుగా వీటిని పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండగానే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments