Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రహ్మాస్త్ర ట్రైలర్ - రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన రాజ‌మౌళి

Advertiesment
Ranbir Kapoor, S.S. Rajamouli, Ayan Mukherjee
, మంగళవారం, 31 మే 2022 (18:12 IST)
Ranbir Kapoor, S.S. Rajamouli, Ayan Mukherjee
"బ్రహ్మస్త్రం" ట్రైలర్ కోసం ఆశక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకి  సూపర్ స్టార్ రణబీర్ కపూర్, లెజెండరీ డైరెక్టర్ S.S. రాజమౌళి మరియు దర్శకుడు అయాన్ ముఖర్జీ ట్రైలర్ తేదీని ప్రకటించి  అభిమానులని ఆశ్చర్యపరిచారు.
 
దేశంలోనే అందమైన నగరంగా పేరు పొందిన విశాఖపట్నంను మంగ‌ళ‌వారంనాడు సందర్శించి అభిమానుల మధ్య ఘనంగా మూవీ ప్రమోషన్స్ ప్రారంభించారు. "బ్రహ్మాస్త్రం" టీం ను ప్రేమతో ఆహ్వానిస్తూ అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ చిత్ర యూనిట్  ప్రసిద్ధ చెందిన చారిత్రాత్మకమైన సింహాచలం ఆలయంలో ప్రార్థనలు కూడా జరిపారు.
 
అనంత‌రం వారు మాట్లాడుతూ, మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న "బ్రహ్మాస్త్ర" ట్రైలర్  జూన్ 15న విడుదల కానుంది. ఇంకో 100 రోజుల్లో బ్రహ్మస్త్రం పార్ట్ వన్  థియేటర్లలో విడుదలవుతుంది. అని రాజ‌మౌళి ప్ర‌క‌టించారు.
 
స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ  ప్రతిష్టాత్మమైన  సినిమాని 09.09.2022న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఎస్.ఎస్.రాజమౌళి ఈ సినిమాని సమర్పిస్తున్నారు.
 
అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్‌ల, అలియా భట్, మౌని రాయ్ మరియు నాగార్జున అక్కినేని లాంటి భారీ తారాగణం ఈ సినిమాలో కనిపించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నటి అత్యాచార కేసు.. మలయాళ నటుడు విజయ్ బాబుకు దక్కని బెయిల్