Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్ 2.O : కొత్త మంత్రివర్గం ఇదే...

Webdunia
ఆదివారం, 10 ఏప్రియల్ 2022 (17:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త మంత్రి మండలిని ప్రభుత్వం ఆదివారం అధికారికంగా వెల్లడించింది. పాత, కొత్త కలయికతో మొత్తం 25 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వీరిలో నగరి ఎమ్మెల్యే ఆర్కే. రోజాకు లక్కీ ఛాన్స్ దక్కింది. 2024లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ కూర్పును సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 
 
ఇప్పటికే నూతన మంత్రుల జాబితా గవర్నర్ వద్దకు వెళ్లింది. సీఎం పేషీ నుంచి కొత్త మంత్రులకు ఫోన్‌లు వెళ్లాయి. ఫోన్‌ రావడంతో ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ విజయవాడ బయల్దేరారు. కొత్త, పాత మంత్రులకు సీఎం పేషీ నుంచి ఫోన్‌లు వెళ్లాయి. మరికొందరికి జీఏడీ నుంచి ఫోన్‌లు వచ్చాయి. సోమవారం ప్రమాణస్వీకారానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. 
 
కొత్త మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నవారిలో శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణ, రాజన్నదొరలకు చోటు కల్పించారు. 
 
అలాగే, విశాఖపట్టణం నుంచి గుడివాడ అమర్నాథ్‌, ముత్యాలనాయుడు, తూర్పుగోదావరి నుంచి దాడిశెట్టిరాజా, విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పశ్చిమ గోదావరి నుంచి తానేటి వనిత, కారుమూరి నాగేశ్వర రావు, కొట్టు సత్యనారాయణలకు చోటు కల్పించారు. 
 
పాత మంత్రుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామిని మళ్లీ చోటు కల్పించారు. అలాగే, ఆర్కే. రోజా, జోగి రమేష్, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, విడుదల రజనీ, కాకాని గోవర్థన్ రెడ్డి, అంజాద్ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, ఉషా శ్రీ చరణ్, తిప్పేస్వామిలకు చోటు కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments