Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూన్‌లో వర్షాలు కురిస్తే సాధారణ స్థితికి... పవర్ హాలిడే ఇవ్వాలి..

Advertiesment
power cuts
, శనివారం, 9 ఏప్రియల్ 2022 (12:14 IST)
ఏపీలో విద్యుత్ డిమాండ్ అధికంగా వున్న కారణంగా.. వినియోగదారులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని సహకరించాలని ఇంధనశాఖ ఇన్‌చార్జ్ కార్యదర్శి బి.శ్రీధర్ కోరారు. జూన్‌లో వర్షాలు కురిస్తే డిమాండ్ సాధారణస్థితికి చేరుకుంటుందన్నారు. విద్యుత్ కోత తాత్కాలికమేనని చెప్పారు. 
 
సాధ్యమైనంత వరకు విద్యుత్‌ను కొనుగోలు చేసి అందించేందుకే ప్రయత్నిస్తున్నట్టు శ్రీధర్ చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ 235 మిలియన్ యూనిట్లుగా ఉంటే 180 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అవుతోందన్నారు. దీంతో 55 ఎంయూల కొరత ఏర్పడుతోందని, దీనిని ఎక్చేంజ్‌లలో కొంటున్నట్టు చెప్పారు.
 
మార్కెట్‌లో విద్యుత్ దొరకనప్పుడు కోతలు విధిస్తున్నట్టు శ్రీధ్ తెలిపారు. అలాగే, పరిశ్రమలు మార్చిలో వినియోగించిన విద్యుత్‌లో సగమే వాడాలని, రాత్రీపగలు పనిచేసే కంపెనీల్లో నైట్ షిఫ్ట్‌లు రద్దు చేస్తున్నట్టు చెప్పారు. వారంలో మరో రోజు విద్యుత్ హాలిడే ఇవ్వాలని పరిశ్రమలకు చెప్పినట్టు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. భర్తను కడతేర్చిన భార్య