Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మొబైల్ ఫోన్ వెలుతురులో ప్రసవాలు.. ఈ దుస్థితికి..?: పవన్ ఫైర్

pawan kalyan
, శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (18:39 IST)
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సంక్షోభానికి వైసీపీ అనాలోచిత విధానాలే కారణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. 
 
అనధికార విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారని వాపోయారు. పవర్ హాలిడే ప్రకటనతో పారిశ్రామిక అభివృద్ధికి విఘాతం కల్గుతుందన్నారు. 36 లక్షల మంది కార్మికుల ఉపాధికి దూరమయ్యారని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ వెలుతురులో ప్రసవాలు రాష్ట్రంలో దుస్థితిని తెలియచేస్తున్నాయని చెప్పారు. 
 
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉండేది.. దీంతో 2014-19 సమయంలో అప్పటి ప్రభుత్వ హయాంలో విద్యుత్ కోతల ప్రభావం పెద్దగా ఉండేది కాదని గుర్తు చేశారు. 
 
వైసీపీ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు రద్దు చేసిందన్నారు. యూనిట్ రూ. 4.80 చొప్పున 25 ఏళ్ల పాటు గ్రీన్ ఎనర్జీ కంపెనీలతో అప్పటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసిందని చెప్పారు. 
 
లోపభూయిష్ట నిర్ణయాల వల్లే విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని విమర్శించారు. ఉచితం అని చెప్పి 57 శాతం ఛార్జీలు పెంచారని విమర్శించారు.
 
ఫ్యాను, రెండు లైట్లు, 15 గంటలు టీవీ చూసినా 150 యూనిట్లే ఖర్చు అవుతుందని, మరో 50 యూనిట్లు పెద్ద మనసుతో అదనంగా ఇస్తున్నామని చెప్పారని తెలిపారు. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచి ఇళ్లల్లో ఫ్యాన్లు వేసుకోకుండా చేశారని పేర్కొన్నారు.  
  
వ్యక్తిగత అజెండాతో జనసేన పార్టీని స్థాపించలేదని స్పష్టం చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల నుంచి పెరిగిన విద్యుత్ ఛార్జీల వరకు ప్రజల పక్షానే పోరాటం చేస్తున్నామని తెలిపారు.  
 
వ్యక్తిగతంగా దూషణలకు దిగితే వాటిని ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసు అన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడి తమ సహనాన్ని పరీక్షించ వద్దు అని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫిక్స్‌ డెర్మా క్యాంపెయిన్‌లో భాగంగా పాండాగా మారిపోయిన నటుడు బొమన్‌ ఇరాని