దేవుడి దయ, ప్రజల అభిమానం ఉన్నంతవరకు తన వెంట్రుక కూడా ఎవరూ పీకలేరని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. నంద్యాలలో వసతి దీవెన కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగింస్తూ, గత ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు. దేవుని దయ, ప్రజల అభిమానం ఉన్నంతవరకు తన వెంట్రుక కూడా ఎవరూ పీకలేరన్నారు.
అంతేకాకుండా రోజుకో కథ చెప్పి ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కుట్రకు పార్లమెంటును సైతం వాడుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి ప్రతిపక్షం ఉండటం మన దురదృష్టకరమన్నారు.
స్కూలు పిల్లలకు ఇస్తున్న చిక్కి కవర్‌పై కూడా జగన్ ఫోటో ఉందని ఎల్లో మీడియా ప్రత్యేక కథనాలు రాస్తుందని చెప్పుకొచ్చారు. ఈ కడుపు మంట, అసూయకు మందు లేదన్నారు. ఇవి రెండూ ఎక్కువైతో గుండెపోటు వచ్చి టిక్కెట్ తీసుకుటారంటూ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు కూడా తామే చెల్లిస్తున్నామని ఆయన వెల్లడించారు.