రాంగ్ కాల్.. కన్నబిడ్డపై అనుమానం.. కొట్టే చంపేసిన వైనం.. ఎక్కడ?

ఫోన్ రింగ్ కావడంతో ఆ అమ్మాయి కాల్ అటెండ్ చేసింది. అయితే అవతలి వారు మాట్లాడకపోవడంతో హలో హలో అంటూ కట్ చేసింది. ఇంతలో ఆ బాలిక ఎవరో అబ్బాయితో మాట్లాడిందనే అనుమానంతో.. కన్నబిడ్డనే కొట్టి చంపేశాడు.. ఆమె తండ

Webdunia
సోమవారం, 1 జనవరి 2018 (14:11 IST)
ఫోన్ రింగ్ కావడంతో ఆ అమ్మాయి కాల్ అటెండ్ చేసింది. అయితే అవతలి వారు మాట్లాడకపోవడంతో హలో హలో అంటూ కట్ చేసింది. ఇంతలో ఆ బాలిక ఎవరో అబ్బాయితో మాట్లాడిందనే అనుమానంతో.. కన్నబిడ్డనే కొట్టి చంపేశాడు.. ఆమె తండ్రి. ఈ ఘటన విజయవాడలో కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. విజయవాడ, అజిత్ సింగ్ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ రమణ కుమార్తె కృష్ణవేణి (15) పదో తరగతి చదువుతోంది. చదువులో రాణించే కృష్ణవేణి... శనివారం నాడు ఆమె తండ్రి ఫోన్ రింగ్ కావడంతో లిఫ్ట్ చేసింది. 
 
కానీ అవతలి వైపు నుంచి మాటలు వినిపించకపోవడంతో హలో హలో అంటూ ఫోన్ కట్ చేసింది. అప్పుడే రమణకు కృష్ణవేణిపై అనుమానం కలిగింది. ఎవరు ఫోన్ చేశారని కృష్ణవేణి రమణ నిలదీశాడు. ఎవరో రాంగ్ కాల్ చేశాడని చెప్పడంతో, అనుమానంతో కుమార్తెను చితకబాదాడు. అడ్డు వచ్చిన తల్లిని కూడా కొట్టాడు. కాసేపటి తరువాత మందు కొట్టి వచ్చి మరోసారి వారిపై రెచ్చిపోయాడు. 
 
రమణ దెబ్బలకు తట్టుకోలేక కృష్ణవేణి ప్రాణాలు కోల్పోయాడు. అయితే గుట్టుచప్పుడు కాకుండా అమ్మాయి కడుపు నొప్పితో చనిపోయిందని అంత్యక్రియలు చేయాలనుకున్నాడు. కానీ స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

Bandla Ganesh: రవితేజకి ఆల్టర్నేట్ జొన్నలగడ్డ సిద్దు: బండ్ల గణేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments