విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఒకే ఫ్యామిలీ మెంబర్స్

Webdunia
బుధవారం, 23 జూన్ 2021 (14:07 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కేటుంబంలోని నలుగురు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కర్నూలుకు చెందిన ప్రతాప్‌, హేమలత అనే దంపతులు ఉన్నారు. వారికి కుమారుడు జయంత్‌, కూతురు రిషిత ఉన్నారు. ప్రతాప్‌ టీవీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. 
 
అయితే, మంగళవారం రాత్రి నలుగురు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఉదయం ఇంట్లోనుంచి ఎవరూ రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 
 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే నలుగురు విగత జీవులుగా పడి ఉన్నారు. ఘటనా స్థలంలో దొరికిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
ఇటీవల సన్నిహితులు, బంధువులు మరణించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

మెగా ఆఫర్ కొట్టేసిన మలయాళ బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments