Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేడు కర్నూల్‌కి నారా లోకేష్ - జగన్ సర్కారుపై బాబు ధ్వజం

Advertiesment
నేడు కర్నూల్‌కి నారా లోకేష్ - జగన్ సర్కారుపై బాబు ధ్వజం
, శుక్రవారం, 18 జూన్ 2021 (12:24 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చారు. ఆయ జిల్లాలోని పెసరవాయిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఫ్యాక్షన్ హత్యకు గురైన టీడీపీ నాయకులు ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర రెడ్డి కుటుంబాలను లోకేష్ పరామర్శించనున్నారు. లోకేష్ పర్యటన నేపథ్యంలో పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 
 
అంతకుముందు కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో టీడీపీకి చెందిన సోదరులు వడ్డి నాగేశ్వర్ రెడ్డి, వడ్డి ప్రతాప్ రెడ్డిలను ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. ఈ ఫ్యాక్షన్ హత్యలతో కర్నూలు జిల్లా ఉలిక్కిపడింది. 
 
ఈ హత్యలపై నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. జగన్ సీఎం ముసుగు తీసేసి ఫ్యాక్షనిస్ట్ నిజరూపాన్ని బయటపెడుతున్నారని మండిపడ్డారు. 
 
ఫ్యాక్షన్ గ్యాంగులు వేటకొడవళ్లు, కత్తులు, గొడ్డళ్లకు పదునుపెట్టి పల్లెల్లో ప్రతీకారాలకు దిగుతున్నాయని అన్నారు. టీడీపీ శ్రేణులే లక్ష్యంగా వైసీపీ ఫ్యాక్షన్ ముఠాలు చెలరేగిపోతున్నాయని లోకేశ్ దుయ్యబట్టారు.
 
పాణ్యం నియోజకవర్గంలోని టీడీపీ నేతలు నాగేశ్వరరెడ్డి, ప్రతాప్ రెడ్డిలను కారుతో ఢీకొట్టిన ఫ్యాక్షన్ లీడర్లు వేటకొడవళ్లతో నరికి చంపేయడం అత్యంత దారుణమని అన్నారు. ఈ దాడిలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని, వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. 
 
మృతులు, బాధిత కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ దారుణ మరణాలు జగన్ రెడ్డి, ఆయన పార్టీ నేతల నెత్తుటి దాహానికి సాక్ష్యమని అన్నారు.
 
ఫ్యాక్షన్ ముఠాలు ఆ ఫ్యాక్షన్‌కే అంతమవుతాయని లోకేశ్ అన్నారు. ఫ్యాక్షన్ గ్రామాల్లో శాంతి నెలకొల్పడానికి, స్నేహపూర్వక వాతావరణం కల్పించడానికి టీడీపీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోలార్ పవర్ ప్రాజెక్టు టెండర్లు చట్ట విరుద్ధం : ఏపీ సర్కారు హైకోర్టు షాక్