హైవేలపై ప్రయాణం చేస్తున్నారా.. నకిలీ పోలీసులున్నారు.. తప్పించుకోవడం... ఎలా.?

Webdunia
సోమవారం, 19 ఆగస్టు 2019 (16:45 IST)
మీరు వాహనంపై వెళ్ళేటప్పుడు పోలీసులు ఎదురు పడ్డారా.. తనిఖీల కోసమని వాహన పత్రాలు ఇమ్మని లేకుంటే ఫైన్ కట్టమని అడుగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త. ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి. మీకు తగిలిన వ్యక్తి డూప్లికేట్ పోలీస్ కావచ్చు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా.. అవును మరి. దందాల కోసం హైవేలపై మాటువేసి మీ జేబులు ఖాళీ చేసే నకిలీ ఖాకీలున్నారు. 
 
అన్నీ చోట్లా డూప్లికేట్‌లు తయారవుతున్నట్లే పోలీసుల్లోనూ నకిలీగాళ్ళ బెడద తప్పడం లేదు. ఖాకీ చొక్కా కనిపిస్తే కంగారుపడే సామాన్యుల బలహీనతలను ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్నారు కొంతమంది డూప్లికేట్ పోలీసులు. 
 
ముఖ్యంగా హైవేలపైన ఇతర వాహన రద్దీ ఎక్కువ ఉన్న చోట్ల సడెన్‌గా ప్రత్యక్షమైపోతారు. మనం వెళుతున్న వాహనాన్ని ఆపి మరీ దబాయిస్తారు. అచ్చం పోలీసుల ఫ్యాషన్‌నే ఉపయోగిస్తూ లైసెన్స్ నుంచి ఇన్సూరెన్స్ వరకు టకాటకా వివరాలు అడిగేస్తారు. పొరపాటున ఒక్క పత్రం లేకపోయినా ఇంక దబాయింపులు మొదలుపెడతారు. 
 
మొదటి స్టేషన్‌కు పదమని బెదిరిస్తూ తర్వాత వాహనం కీని తీసుకుంటున్నట్లుగా బిల్డప్ అంతా ఇస్తారు. ఎదుటివారిలో కనిపిస్తున్న భయాన్ని బట్టి ఎంత డబ్బు గుంజాలో నిర్ణయానికి వచ్చి ఆలోచించి మరీ ఫైన్ కట్టమంటారు. పైగా సిన్సియర్ పోలీసు తరహాలో రిసిప్ట్‌లు కూడా ఇస్తుంటారు. అలా ఒక్కో వాహనదారుడి నుంచి వెయ్యి రూపాయల నుంచి వాహనాన్ని బట్టి ఐదు వేల రూపాయల దాకా గుంజుతారు. ఇలా చిత్తూరు జిల్లాలో నిత్యం జరుగుతున్న నకిలీ పోలీసుల దందాలతో, నకిలీ పోలీసులు రెచ్చిపోతున్నారు. పాపం సామాన్యులు పోలీసులనుకుని జేబులను గుల్ల చేసుకుంటున్నారు. 
 
ఒక్కోసారి జనం లేని నిర్మానుషమైన ప్రదేశాల్లో కత్తుల వంటి మారణాయుధాలతో బెదిరిస్తున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. డబ్బుతో పాటు బంగారమే కాకుండా వారు ప్రయాణించే వాహనాలను దబాయించి మరీ లాక్కుంటున్నారు నకిలీ కేటుగాళ్లు. ఇదే కోవకు చెందిన అనిల్ అనే నకిలీ పోలీసు ఆగడాలు శృతిమించడంతో బాధితుల ఫిర్యాదుతో కేటుగాడిపై నిఘా పెట్టారు చిత్తూరు పోలీసులు. 
 
గత కొన్నిరోజులుగా అనిల్ కోసం గాలిస్తున్నా తెలివిగా తప్పించుకుని తిరుగుతూ వస్తున్నాడు. అయితే పథకం ప్రకారం హైవేలపైనే నకిలీ పోలీసు అనిల్‌పై నిఘా ఉంచి రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకుని అతన్ని కటకటాల వెనక్కి పంపారు పోలీసు అధికారులు.
 
పోలీసులు తమదైన శైలిలో విచారించగా బయటకొచ్చిన నేరచరిత్రను విని ఆశ్చర్యపోయారు. నకిలీ పోలీస్ అనిల్ మొదట్లో యూనిఫాం కూడా ధరించి దందాలు చేసేవాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. నిందితుడిపై చిత్తూరుజిల్లానేకాకుండా ఒంగోలు, నెల్లూరు జిల్లాలలో కూడా కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదైనప్పటికీ అతి తెలివితో పోలీసుల కన్నుగప్పి తిరుగుతూ వస్తున్నారు. 
 
నిందితుని నుంచి మూడు ద్విచక్ర వాహనాలు, ఐదు లక్షల రూపాయల నగదుతో పాటు బాధితుల నుంచి దౌర్జన్యం చేసి లాక్కున్న వస్తువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడైనా పోలీసు తనిఖీలు జరిగినప్పుడు జనం జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుతున్నారు. అనిల్ తో పాటు నకిలీ పోలీసుల గ్యాంగ్ లో మరికొంతమంది ఉన్నట్లుగా సమాచారం. దీంతో వారి వివరాలను కూడా కూపీ లాగుతున్నారు పోలీసులు. ఇలా చిత్తూరుజిల్లాలో వెలుగుచూసిన నకిలీ ఖాకీ వ్యవహారం సంచలనంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments