మనుషులకే కాదు జంతువులకు ప్రేమ ఉంటుందని నిరూపించింది ఒక ఏనుగు. పలమనేరు మండలంలో గత కొన్నిరోజుల నుంచి ఏనుగులు భీభత్సం సృష్టిస్తున్నాయి. తిండి కోసం అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి.
పలమనేరు మండం జి.కోటూరులో ఒక ఏనుగు తన పిల్ల ఏనుగును వెంట పెట్టుకుని నిన్న ఉదయం పంటలపైకి వచ్చింది. రైతుల పంటలను ధ్వంసం చేస్తూ కనిపించింది. తల్లితో పాటు పిల్ల ఏనుగు రాకుండా కరెంట్ తీగలు పెట్టిన ప్రాంతంలోకి వెళ్ళింది. దీంతో కరెంట్ షాక్‌కు గురై తల్లి ఏనుగు చనిపోయింది.
దీంతో నిన్న రెండు గంటల పాటు పెద్ద ఏనుగు పిల్ల ఏనుగు చుట్టూ తిరుగుతూనే కనిపించింది. అటవీ శాఖాధికారులు ఆ ఏనుగును అటవీ ప్రాంతంలోకి తరిమేశారు. అయితే తన పిల్ల ఏనుగు మరణానికి కారణమైన విద్యుత్ స్థంభాన్ని గుర్తుపెట్టుకున్న తల్లి ఏనుగు కసితో ఆ స్థంభాన్ని ధ్వంసం చేసింది.
ఈరోజు తెల్లవారుజామున పొలంలోకి వచ్చి విద్యుత్ స్థంభాన్ని నుజ్జునుజ్జు చేసింది. విషయం తెలుసుకున్న అటవీశాఖాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జంతువులకు కూడా ప్రేమ, కోపం ఉంటుందని అటవీశాఖాధికారులు చెబుతున్నారు. ఈ ఘటనతో స్థానిక రైతులు భయాందోళనకు గురవుతున్నారు.