Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్కె తీర్చకుంటే యాసిడ్ దాడి చేస్తా.. యువతికి జులాయ్ వార్నింగ్

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (09:11 IST)
హైదరాబాద్‌ నగరానికి చెందిన ఓ యువతికి జులాయ్‌గా తిరిగే ఓ యువకుడు గట్టివార్నింగ్ ఇచ్చాడు. తనను ప్రేమించి, కోర్కె తీర్చకుంటే ముఖంపై యాసిడ్ దాడి చేస్తానంటూ బెదిరించాడు. దీంతో భయపడిపోయిన ఆ యువతి నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నగరానికి చెందిన ఓ యువతికి మూడేళ్ల క్రితం నిఖిల్‌తో పరిచయం ఏర్పడింది. నిఖిల్‌ ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంట పడేవాడు. ఈ విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు నిఖిల్‌ను హెచ్చరించారు. మరోసారి కలిస్తే బాగుండదని మందలించారు. అనంతరం ఆ యువతిని తన పెద్దమ్మ ఇంట్లో ఉంచారు. 
 
ఈ నేపథ్యంలో ఇటీవల ఆ యువతికి బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 12లో ఓ కార్యాలయంలో ఉద్యోగం వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న నిఖిల్‌ గురువారం కార్యాలయం వద్ద కాపు కాశాడు. యువతి రాగానే తన ప్రేమను అంగీకరించి కోర్కె తీర్చాలంటూ ఒత్తిడి తెచ్చాడు. తనతో తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు.
 
ఆ యువతి అందుకు నిరాకరించడంతో తన వెంట తెచ్చిన యాసిడ్ బాటిల్‌ చూపించి ముఖం మీద పోస్తానని బెదిరించాడు. బలవంతంగా యువతిని ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని వెళ్లాడు. దీన్ని గమనించిన కొందరు బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిఖిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments